కోలీవుడ్ స్టార్ కమెడియన్ వడివేలు కరోనా బారినపడ్డారు. తన సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం రీసెంట్ గా ఆయన లండన్ కు వెళ్లారు. అక్కడ నుంచి ఇండియాకు తిరిగొచ్చిన తరువాత కొన్నిరోజుల నుంచి కరోనా లక్షణాలు కనిపించడంతో వెంటనే పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో అతడికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 


ప్రస్తుతం ఆయన చెన్నైలోని శ్రీరాంచంద్ర మెడికల్ సెంటర్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. యూకేలో ఒమిక్రాన్‌ కేసులు ఎక్కువగా ఉన్న కారణంగా.. ఆయనకు కొత్త వేరియంట్ సోకిందేమోనని డాక్టర్లు అనుమానిస్తున్నారు. దీంతో ఆయన శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కి పంపించారు. దీనికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. విషయం తెలుసుకున్న అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. 


ఈ మధ్యకాలంలో చాలా మంది స్టార్లు కోవిడ్ బారిన పడ్డారు. కమల్ హాసన్ అయితే కొన్నిరోజుల పాటు హాస్పిటల్ లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నారు. రీసెంట్ గా కరీనా కపూర్ కి కూడా కరోనా సోకింది. ఇప్పుడు ఆమెకి నెగెటివ్ వచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. వడివేలు కూడా నెగెటివ్ తో బయట పడాలని కోరుకుందాం. 


'చంద్రముఖి', 'హింసించే 23వ పులకేశి' వంటి సినిమాలతో తెలుగువారికి కూడా దగ్గరయ్యారు వదిలేవు. కొన్నాళ్లుగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. త్వరలోనే సురాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'నాయి శేఖర్ రిటర్న్స్'తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు వడివేలు. రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. 






Also Read:హీరోయిన్ తో ఆమిర్ ఖాన్ సీక్రెట్ మ్యారేజ్.. అసలు నిజమిదే..


Also Read: పవన్ కల్యాణ్ వెనుక వరుణ్ తేజ్... 'గని' రిలీజ్ డేట్ ఫిక్స్!


Also Read: తొడ కొట్టిన బాలయ్య... తగ్గేదే లే!


Also Read: భీమ్లా నాయక్... పవన్ కల్యాణ్ కోసం త్రివిక్రమ్ స్పెషల్ క్లైమాక్స్!


Also Read: '83' మూవీ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే...?


Also Read: తల్లిదండ్రులకు ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టిస్తున్న 'చమ్మక్' చంద్ర...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి