విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. బ్లాస్ట్ ఫర్నేస్ ప్లాంట్-2లో ల్యాడిల్‌కు రంద్రం పడినట్లు తెలుస్తోంది. బ్లాస్ట్ ఫర్నేస్‌లో ఏర్పడిన రంద్రం వల్ల ఉక్కు ద్రవం నేలపాలైంది. అందులోనూ పరిశ్రమ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్టీల్ ప్లాంట్‌లో చెలరేగిన మంటలల్లో రెండు లారీలు దగ్ధమైనట్లు సమాచారం. స్టీల్ ప్లాంట్ నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదం ఘటనలో నలభై నుండి యాభై లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించి ఉండొచ్చునని ప్రాథమికంగా అంచనా వేశారు.
ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం సంభవించలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గతంలోనూ విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదాలు జరిగాయి. తాజాగా జరిగిన అగ్ని ప్రమాదం వల్ల భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ప్రాథమికంగా 50 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు భావిస్తున్నా.. ఓవరాల్‌గా కోటికి పైగా నష్టం ఏర్పడే అవకాశం ఉందని సమాచారం. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read: Four Day Work Week: 4 రోజులే పని.. పెరగనున్న బేసిక్ పే.. మారనున్న సాలరీ స్ట్రక్చర్!
గత ఏడాది వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పవర్ ప్లాంట్ 2లో అగ్ని ప్రమాదం జరిగింది. లూబ్రికెంట్ సిస్టమ్‌లో ఆయిల్ లీక్ కావడంతో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. తక్కువ సమయంలో స్పందించిన సిబ్బంది మరమ్మతులు చేపట్టడంతో ప్రమాదం తప్పిపోయింది. తాజాగా జరిగిన ప్రమాదంపై ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ప్లాంట్‌కు చేరుకుని పరిశీలిస్తున్నారు. సిబ్బందికి మరింత జాగ్రత్తగా ఉండాలని జాగ్రత్తలు సూచిస్తున్నారు.