వారానికి నాలుగు రోజులే పని! వినడానికి ఎంతో బాగుంది కదా! త్వరలోనే ఇది నిజమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వేతనాలు, సామాజిక భద్రత, పరిశ్రమ సంబంధాలు, ఉద్యోగుల భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నాలుగు కొత్త కార్మిక చట్టాలను అమల్లోకి తేనుందని సమాచారం. 2022 ఆర్థిక ఏడాది ఆరంభం నుంచి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉందని సీనియర్‌ అధికారి ఒకరు చెబుతున్నారు.


కొత్త నిబంధనల ప్రకారం దేశ వ్యాప్తంగా ఉద్యోగులకు వారానికి మూడు రోజులు సెలవులు ఇస్తారు. నాలుగు రోజులే విధులు ఉంటాయి. కేంద్రం ఇప్పటికే నిబంధనలపై తుది నిర్ణయం తీసుకొంది. ఇప్పుడు రాష్ట్రాలు ఇందుకు అనుగుణంగా నిబంధనలను సవరించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కొత్త నిబంధనలే అమలైతే దేశవ్యాప్తంగా పని సంస్కృతిలో మార్పు రావడం తథ్యం. పని రోజులు తగ్గడమే కాకుండా ఉద్యోగి చేతికందే వేతనం, పని గంటల్లో మార్పు ఉంటుంది.


'ఇప్పటికే చాలా రాష్ట్రాలు కొత్త కార్మిక స్మృతులపై నిర్ణయానికి వచ్చాయి. నిబంధనలను సవరిస్తున్నాయి. దాంతో 2022-23 నుంచి నాలుగు కొత్త కార్మిక స్మృతులు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. 2021, ఫిబ్రవరిలోనే కేంద్రం ముసాయిదా నిబంధనలపై తుది నిర్ణయం తీసుకుంది. కార్మిక చట్టాలు కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి పరిధిలోకి వస్తాయి కాబట్టి రాష్ట్రాలు అమలు చేయాలని కేంద్రం కోరుకుంటోంది' అని ఆ ప్రభుత్వ అధికారి పీటీఐకి తెలిపారు.


కేంద్ర కార్మిక శాఖా మంత్రి భూపేందర్‌ యాదవ్‌ సైతం గత వారం రాజ్యసభలో నాలుగు కార్మిక స్మృతులపై మాట్లాడారు. 13 రాష్ట్రాలు నిబంధనలను ముసాయిదాలో చేర్చాయని వెల్లడించారు. ఉత్తరాఖండ్‌, ఉత్తర్ ప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌, చత్తీస్‌ గఢ్‌, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్‌, హరియాణా, ఝార్ఖండ్‌, పంజాబ్‌, మణిపుర్‌, బిహార్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్ము, కశ్మీర్‌ ముసాయిదా నిబంధనలను ప్రచురించాయి.


కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగి సాలరీ స్ట్రక్చర్‌ మారుతుందని అంటున్నారు. చేతికి అందే జీతం కాస్త తగ్గుతుందని సమాచారం. ఇందుకు ఓ కారణం ఉంది. పీఎఫ్‌ లెక్కించే విధానం మారుతుంది. కొత్త విధానం ప్రకారం అలవెన్సెలు వేతనంలో 50 శాతం కన్నా ఎక్కువ ఉండొద్దు. అంటే జీతంలో బేసిక్‌ పే కనీసం 50 శాతం ఉండాలన్నమాట. సాధారణంగా ఉద్యోగులు తక్కువ బేసిక్‌ పే, ఎక్కువ అలవెన్సెలు తీసుకోవడంతో చేతికి ఎక్కువ డబ్బు వస్తుంది. ఇప్పుడు 50 శాతం మూల వేతనం ఉంటుంది కాబట్టి పీఎఫ్‌కు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. గ్రాట్యుటీ పేమెంట్‌ కూడా పెరగనుంది. మరికొన్ని రోజులు ఆగితే పూర్తి వివరాలు తెలుస్తాయి.


Also Read: Tesla Smartphone: క్రేజీ ఎలన్‌ మస్క్‌! టెస్లా నుంచి మొబైల్‌ ఫోన్‌.. ఫీచర్లు ఇవే!!


Also Read: Multibagger Stock: 19 నెలల్లో రూ.లక్షకు రూ.20 లక్షల లాభం ఇచ్చే మల్టీబ్యాగర్‌


Also Read: Cryptocurrency Prices Today: రూ.3 లక్షల కోట్లు తగ్గిన బిట్‌కాయిన్‌, ఎథిరియమ్‌ విలువ.. మిగతావీ??


Also Read: Medplus IPO: మెడ్‌ప్లస్‌ లిస్టింగ్‌ సూపర్‌హిట్‌.. లాట్‌కు లాభం ఎంతొచ్చిందంటే?


Also Read: Hyundai Venue Facelift: హ్యుండాయ్ కొత్త కారు వచ్చేస్తుంది... వావ్ అనిపించే లుక్, డిజైన్లు


Also Read: PAN card Update: పెళ్లైన తర్వాత పాన్‌ కార్డులో ఇంటి పేరు మార్చుకోవాలా..? ఇలా చేయండి.