స్టాక్ మార్కెట్లో మల్టీ బ్యాగర్ షేర్ల కోసం మదుపర్లు ఆసక్తిగా వెతుకుతుంటారు. ఏదైనా కంపెనీ షేరు ధర అమాంతం పెరుగుతుందా? ఎంత కాలంలో ఎంత పెరిగింది? వంటి వివరాలను తెలుసుకుంటూనే ఉంటారు. బోరోసిల్ రిన్యూవబుల్స్ సైతం ఇలాంటిదే. 19 నెలల క్రితం ఇందులో రూ.లక్ష పెట్టుబడి పెట్టిన మదుపర్లకు రూ.20 లక్షల వరకు రాబడి ఇచ్చింది. 19 నెలల కాలంలో రూ.34 నుంచి రూ.694కు చేరుకుంది. అంటే 1900 శాతం ర్యాలీ చేసిందన్నమాట.
నెల రోజుల్లో బోరోసిల్ షేరు ధర రూ.510 నుంచి రూ.694కు స్థాయికి చేరుకుంది. దాదాపుగా 36 శాతం పెరిగింది. చివరి 6 నెలల కాలంలో రూ.260 నుంచి రూ.690కి చేరుకుంది. అంటే 166 శాతం ర్యాలీ చేసింది. అలాగే చివరి ఏడాది కాలంలో రూ.170 నుంచి రూ.694 వరకు ఎగిసింది. ఏకంగా 310 శాతం పెరిగింది. ఇక 2020, మే29న రూ.34గా ఉన్న 2021, డిసెంబర్ 17కి రూ.694కు చేరుకుంది.
రూ. లక్ష పెట్టుబడికి రాబడి
నెల క్రితం లక్ష పెడితే రూ.1.36 లక్షలు
6 నెలల క్రితం లక్ష పెడితే రూ.2.66 లక్షలు
12 నెలల క్రితం లక్ష పెడితే రూ.4.10 లక్షలు
19 నెలల క్రితం లక్ష పెడితే రూ.20 లక్షలు
నోట్: స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి నష్టభయంతో కూడుకున్నది! ఇది కేవలం సమాచారం కోసమే అందిస్తున్నాం. ఫలానా స్టాక్, ఫండ్‌లో పెట్టుబడులు పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. మార్కెట్లో పెట్టుబడులు పెట్టేముందు అన్ని విషయాలు పరిశీలించుకొని, విశ్లేషించుకోవాలి. అవసరమైతే నిపుణుల సాయం తీసుకోవాలి!
Also Read: New Online Payment Rules: జనవరి 1 నుంచి ఆన్‌లైన్ పేమెంట్ నిబంధనల్లో మార్పు.. తెలియకపోతే కష్టం!
Also Read: Snapdeal IPO: ఐపీవోకు స్నాప్‌డీల్.. రూ.1250 కోట్ల సమీకరణకు ముసాయిదా దాఖలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి