ప్రముఖ ఈ-కామర్స్‌ కంపెనీ స్నాప్‌డీల్‌ త్వరలో ఐపీవోకు రానుంది. సంబంధిత ప్రణాళికలన్నీ పూర్తయ్యాయి. రూ.1250 కోట్ల విలువైన ఐపీవో కోసం ముసాయిదాను ఇప్పటికే మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ వద్ద దాఖలు చేసింది.


స్నాప్‌ డీల్‌ ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద 30,769,600 ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. ఇప్పటికే ఉన్న వాటాదారులు 3 కోట్ల షేర్లను జారీ చేస్తారు. పూర్తి సమాచారాన్ని కంపెనీ సెబీకి తెలియజేసింది. సంస్థ స్థాపకులు కునాల్‌ బాల్‌, రోహిత్‌ బన్సాల్‌ తమ వాటాలను విక్రయించడం లేదు.


బ్లాక్‌రాక్‌, టెమాసెక్‌, ఈబే, ఇంటెల్‌ క్యాపిటల్‌, నెక్సస్‌ వెంచర్‌ పార్ట్‌నర్స్‌, టైబౌర్న్‌, ఆర్‌ఎన్‌టీ అసోసియేట్స్‌, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌ సహా మిగతా వాటాదారులూ తమ షేర్లను విక్రయించడం లేదు. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద మాత్రం కొందరు వాటాదారులు షేర్లు అమ్ముతున్నారు. మొత్తంగా ప్రీ ఆఫర్‌ షేర్‌ క్యాపిటల్‌లో ఎనిమిది శాతం వరకు ఐపీవోలో ఇస్తున్నారు.


స్నాప్‌డీల్‌లో 71 షేర్‌హోల్డర్లు ఉన్నారు. అందులో సాఫ్ట్‌బ్యాంక్‌కు 35.41 శాతం వాటా ఉంది. కునాల్‌, రోహిత్‌కు 20.28 శాతం వాటా ఉంది. మధ్య తరగతి ప్రజలు, ధరలను బట్టి కొనుగోళ్లు చేసే వినియోగదారులను స్నాప్‌డీల్‌ లక్ష్యంగా ఎంచుకుంటుంది. మెట్రో నగరాల కన్నా చిన్న పట్టణాల నుంచే కంపెనీకి 86 శాతం ఆర్డర్లు వస్తున్నాయి. జొమాటో, నైకా, పేటీఎం, పాలసీ బజార్‌ వంటి ఇంటర్నెట్‌ ఆధారిత  కంపెనీలు ఐపీవో బాట పట్టడంతో స్నాప్‌డీల్‌ ముందడుగు వేసింది.


Also Read: Life Insurance Plan Tips: ఏ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలో తికమక పడుతున్నారా? ఈ 4 స్టెప్స్‌ చూడండి మరి!


Also Read: SBI FD Rates: గుడ్‌న్యూస్‌..! ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేటు పెంచిన ఎస్‌బీఐ


Also Read: New Online Payment Rules: జనవరి 1 నుంచి ఆన్‌లైన్ పేమెంట్‌ నిబంధనల్లో మార్పు.. తెలియకపోతే కష్టం!


Also Read: Multibagger stock: ఐదేళ్లు: ఈ షేరులో లక్షకు రూ.5 లక్షల లాభం!


Also Read: Minister KTR: చేనేత, వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ పెంపు సరికాదు.... కేంద్రమంత్రికి కేటీఆర్ లేఖ... చేనేత రంగం కుదేలవుతుందని ఆందోళన వ్యక్తం


Also Read: Stock Market: రూ.2,61,812 కోట్లు పతనమైన టాప్‌-10 కంపెనీల మార్కెట్‌ విలువ


Also Read: Omicron Death In US: అమెరికాలో ఒమిక్రాన్‌‌తో తొలి మరణం నమోదు.. యూఎస్‌లో మొదలైన కలవరం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి