Omicron Death In US: ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఆందోళనకు గురిచేస్తున్న అంశం ఒమిక్రాన్. కొన్ని రోజుల కిందట దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తొలి కేసు నమోదు కాగా.. ఇప్పటివరకు దాదాపు 100 దేశాలకు వ్యాప్తి చెందింది. తాజాగా అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. ఈ విషయాన్ని కౌంటీ ఆరోగ్యశాఖ వెల్లడించింది. టెక్సాస్‌లోని హారిస్ కౌంటిలో సోమవారం ఓ వ్యక్తి మరణించినట్లు స్పష్టం చేశారు.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా అమెరికాలో మొదటి మరణం నమోదు కావడంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. అయితే, చనిపోయిన వ్యక్తి ఇప్పటి వరకు కొవిడ్19 టీకా తీసుకోలేదని వెల్లడించారు. అతని వయసు 50 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటుందని ఏబీసీ న్యూస్ రిపోర్ట్ చేసింది. యూఎస్‌లో తొలి కరోనా మరణంపై యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) స్పందించాల్సి ఉంది.
చనిపోయిన వ్యక్తికి గతంలో కరోనా బారిన పడి కోలుకున్నాడు. కానీ అతడు కోవిడ్ టీకా మాత్రం తీసుకోలేదు. కరోనా కొత్త వేరియంట్ కారణంగా ఒకరు మృతి చెందారు. అమెరికాలో ఒమిక్రాన్ కారణంగా నమోదైన తొలి మరణం ఇదేనని కౌంటీ మెజిస్ట్రేట్ లీనా హిడ్గాలో ట్వీట్ చేశారు. కనుక మీరు కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోండి.. మీ ప్రాణాలతో పాటు కుటుంబసభ్యుల ప్రాణాలు కాపాడుకోవాలని ట్వీట్లో రాసుకొచ్చారు.
Also Read: Kidney Failure: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మీ కిడ్నీలు సరిగా పనిచేయడం లేదనే అర్థం
అమెరికాలో ఇటీవల నమోదవుతున్న కరోనా కేసులలో 73 శాతం ఒమిక్రాన్ వేరియంట్ కేసులేనని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. డిసెంబర్ మొదటి వారంలో బ్రిటన్‌లో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. ఇప్పటివరకూ బ్రిటన్ లో 12 మందిని ఒమిక్రాన్ వేరియంట్ బలిగొంది. మరో 104 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని డిప్యూటీ ప్రధాన మంత్రి డొమినిక్ రాబ్ టైమ్స్ రేడియోతో మాట్లాడుతూ తెలిపారు. భారత్‌లో ఒమిక్రాన్ కేసులు 170 వరకు నమోదు కాగా, ఇది మరింత ప్రమాదకారిగా మారకముందే కొవిడ్19 టీకాలు తీసుకోవాలని వైద్య శాఖ, నిపుణులు సూచించారు.
Also Read: Beer: బీరు తాగితే నిజంగానే బొజ్జ పెరుగుతుందా? పెరగకుండా తాగడం ఎలా?