ఒక్కసారి అదృష్టంతో ఇది జరగాలి.. డబ్బులు రావాలి.. ఏవేవో అనుకుంటారు కదా చాలామంది. కానీ అది ఎలా వస్తుంది... అది వచ్చే ముందు మనకే తెలియదులే. అలా జరిగిపోతుంది అంతే. చెప్పకుండా వచ్చేదే కదా అదృష్టమంటే. అలానే కదా కోటీశ్వరులుగా మారిన వాళ్లు కూడా ఉన్నారు. ఓ జాలరీకి కూడా అదృష్టం.. వచ్చింది. అది కూడా సముద్రంలో చేపలు పడుతుండగా. 


ఓ వ్యక్తి సముద్రంలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఎప్పటిలాగే.. వలను సముద్రంలోకి విసిరాడు. కాసేపు అయ్యాక.. చేపలు పడతాయిగా అని వల విసిరే ప్రయత్నం చేశాడు. కానీ అందులో ఏదో చిక్కుకున్నట్టు జాలరీకి అనిపించింది. ఇక దానిని చూడాలని.. పైకి లాగే ప్రయత్నం చేశాడు. అయితే అది బరువుగా అనిపించింది. పక్కన ఉన్న వ్యక్తి సాయంతో పైకి తీసుకొచ్చాడు. 


తాను వేసిన వలలో ఏదో పెట్టే ఉండటాన్ని గమనించాడు. అయితే దానిపై ఆపిల్ లోగో ఉంది. ఎవరో ఖాలీ పెట్టే విసిరేశారు అనుకున్నాడు. కానీ తెరిచి చూస్తే.. నోరెళ్లబెట్టాడు. అందులో చాలా ఐఫోన్, మ్యాక్‌బుక్‌లు ఉన్నాయి. వాటి విలువ లక్షల్లో ఉంటుంది. తనకో నిధి దొరికినంతగా సంబరపడిపోయాడు. అయితే వాటి మీదకు కొంతవరకు నీళ్లు వెళ్లాయి. కానీ అవి పని చేస్తున్నాయి. ఈ వీడియో ఎక్కడిది అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు.


మత్స్యకారుడు ఈ ఘటనను వీడియో తీసి టిక్‌టాక్‌లో పెట్టాడు. అయితే కావాలనే ముందుగా పెట్టేలు అందులో వేసి.. మళ్లీ తీశాడని కొంతమంది అంటున్నారు. పబ్లిసిటీ కోసం చేసి ఉండొచ్చని కామెంట్ చేస్తు్న్నారు. కొంతమంది అదృష్టవంతుడివి బ్రో అంటూ కామెంట్స్ చేశారు. 


Also Read: Omicron Cases In India: భారతదేశంలో 161 ఒమిక్రాన్ కేసులు.. వేరియంట్ పై ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ ఏమన్నారంటే


Also Read: Engineer Sells Train Engine: ఏకంగా రైలు ఇంజిన్‌నే కొట్టేశారు..! అదెలా అంటారా? అదే అసలు ట్విస్ట్!


Also Read: Aishwarya Rai Summoned: ఈడీ ముందుకు ఐశ్వర్య రాయ్.. పనామా పత్రాల కేసులో ప్రశ్నల వర్షం


Also Read: Samantha: యాస మార్చి, ఒకవైపు భుజం ఎత్తి... అల్లు అర్జున్ నటన అద్భుతం, పొగిడేసిన సమంత


Also Read: Electoral Reform Bill: ఆధార్- ఓటర్ ఐడీ అనుసంధాన బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. మరి వ్యక్తిగత గోప్యత మాటేంటి?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి