భారత్‌లో 161 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని, అవసరమైన మందుల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం స్టాక్‌ను ఏర్పాటు చేసిందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. వచ్చే రెండు నెలల్లో దేశంలో వ్యాక్సిన్ తయారీ సామర్థ్యాన్ని నెలకు 45 కోట్ల డోస్‌లకు పెంచుతామని రాజ్యసభలో చెప్పారు.
"ప్రస్తుతం, భారతదేశంలో 161 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. ఒమిక్రాన్ పై నిపుణులతో ప్రతిరోజూ మాట్లాడుతున్నాం. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలోని అనుభవంతో, వేరియంట్ స్ప్రెడ్ అయినప్పుడు.. ఎలా ఎదుర్కోవాలో సిద్ధంగా ఉన్నాం. మెడిసిన్ ను స్టాక్ ఉంచుతున్నాం. మందులు, ఆక్సిజన్ సిద్ధంగా ఉన్నాయి. 48,000 వెంటిలేటర్లను రాష్ట్రాలకు పంపిణీ చేశాం." అని మాండవియా చెప్పారు.
అర్హత కలిగిన జనాభాలో 88 శాతం మందికి కొవిడ్ -19 వ్యాక్సిన్ మొదటి డోస్ మరియు 58 శాతం మందికి రెండో డోస్ అందించినట్లు ఆరోగ్య మంత్రి తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్‌ను అర్థం చేసుకోవడానికి కేంద్రం ఈ అంశంపై రాష్ట్రాలు, నిపుణులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని ఆయన చెప్పారు.
11 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా ఒమిక్రాన్ కేసులు నమోదవ్వగా, ఢిల్లీ తర్వాతి స్థానంలో ఉంది.
ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ.. వైరస్ కొత్త వేరియంట్ నుంచి రక్షణను అందించడానికి COVID-19 వ్యాక్సిన్‌లను సర్దుబాటు చేయవచ్చు. ఈ కొత్త వేరియంట్ శక్తిమంతమైనది కానట్టు అనిపిస్తుంది. వ్యాక్సిన్ వేసుకోవడమే రక్ష. ఇమ్యూనిటీతో ఒమిక్రాన్ నుంచి.. తప్పించుకోవచ్చు.
మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బూస్టర్ షాట్ లపై మాట్లాడారు. బూస్టర్ షాట్‌ల నిర్వహణను అనుమతించాలని కేంద్రాన్ని కోరారు . ఢిల్లీలో 24 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19 పాజిటివ్ అని తేలిన అన్ని నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపుతామని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఆసుపత్రి బెడ్లు, ఆక్సిజన్, మందులకు సంబంధించి.. తగిన ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఢిల్లీలో 30,000 కొవిడ్ పడకలు సిద్ధంగా ఉన్నాయని.. 6,800 అదనపు ఐసీయూ పడకలు కూడా త్వరలో సిద్ధమవుతాయన్నారు.
కర్ణాటకలో మరో ఐదు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 19కి చేరుకుంది. ధార్వాడ్, శివమొగ్గ జిల్లాలోని భద్రావతితోపాటు ఉడిపి, మంగళూరులోనూ కేసులు నమోదయ్యాయి.
Also Read: Engineer Sells Train Engine: ఏకంగా రైలు ఇంజిన్‌నే కొట్టేశారు..! అదెలా అంటారా? అదే అసలు ట్విస్ట్!
Also Read: Omicron Threat: 'అయ్యా.. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి... బూస్టర్‌కు అనుమతివ్వండి'
Also Read: Coronavirus Update: దేశంలో కొత్తగా 6,563 మందికి కరోనా.. 153కు చేరిన ఒమిక్రాన్ కేసులు