ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలన్‌ మస్క్‌ మరో ప్రొడక్ట్‌ను లాంఛ్‌ చేయబోతున్నారట! 'టెస్లా మొబైల్‌'ను ఆవిష్కరించబోతున్నారట. ఇప్పటి వరకు కంపెనీ నుంచి అధికారిక ప్రకటనైతే రాలేదు. కానీ త్వరలోనే మొబైల్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నద్ధం అవుతున్నారని తెలిసింది.


టెస్లా అంటేనే గుర్తొచ్చేది ఎలక్ట్రిక్‌ కార్లు. ప్రపంచ వ్యాప్తంగా వీటిని ఎగుమతి చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఇదే సమయంలో గూగుల్‌ తరహాలో మొబైల్‌ విపణీలో అడుగుపెట్టాలని టెస్లా భావిస్తోంది. భారత్‌లో రిలయన్స్‌ జియోతో కలిసి గూగూల్‌ ఓ ఫోన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. సొంతంగా 'పిక్సెల్‌' బ్రాండ్‌తో మొబైల్‌ ఫోన్లను విక్రయిస్తోంది. షామి సైతం మొదట ఇంటర్నెట్‌ ప్రొవైడర్‌గానే ప్రస్థానం ఆరంభించింది. తర్వాత మొబైల్‌ బ్రాండ్‌ను ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది.


టెస్లా మొబైల్‌ను ఆవిష్కరించేందుకు మరికొన్ని నెలల సమయం పట్టనుందని తెలిసింది. పేరు మోడల్‌ పీఐ/పీ గా ఉంటుందని అంచనా. మొబైల్‌ మాత్రమే కాకుండా సైబర్‌ ట్రక్‌, పిల్లల కోసం ఎలక్ట్రిక్‌ వెహికిల్‌, టెస్లా అంబరిల్లా, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ విజిల్‌ను టెస్లా తయారు చేస్తున్న సంగతి తెలిసిందే.


ఫీచర్లు (అంచనా)



  • టెస్లా విడుదల చేసేది గేమింగ్‌ ఫోన్‌

  • లేత నీలం, ముదరు నీలం, నేవీ బ్లూ రంగుల కాంబినేషన్‌

  • ఫోన్‌ వెనక మధ్య భాగంలో 'టి' సింబల్‌ ఉంటుంది

  • వెనక భాగంలో ట్రిపుల్‌ రియర్‌ కెమెరా

  • 108 MP కెమేరా, 4K స్థాయి 6.5 అంగుళాల తెర

  • స్నాప్‌ డ్రాగన్‌ 898 ప్రాసెసర్‌, 2 టీబీ స్టోరేజ్‌

  • ధర 800-1200 డాలర్లు


Also Read: New Online Payment Rules: జనవరి 1 నుంచి ఆన్‌లైన్ పేమెంట్‌ నిబంధనల్లో మార్పు.. తెలియకపోతే కష్టం!


Also Read: Joker Malware Apps: మీకు తెలియకుండానే మీ డబ్బు కొట్టేస్తున్న జోకర్‌ మాల్వేర్‌.. వెంటనే ఈ 7 యాప్స్‌ డిలీట్‌ చేయండి


Also Read: Snapdeal IPO: ఐపీవోకు స్నాప్‌డీల్‌.. రూ.1250 కోట్ల సమీకరణకు ముసాయిదా దాఖలు


Also Read: IND vs SA: టెస్టు సిరీసు ముందు సఫారీలకు షాక్‌..! ఆ భయంకర పేసర్‌ సిరీసు నుంచి ఔట్‌!


Also Read: South Africa vs India: కోచ్‌ ద్రవిడ్‌ రికార్డుకే ఎసరు పెట్టిన కెప్టెన్‌ కోహ్లీ


Also Read: BWF Rankings: రెండేళ్ల తర్వాత టాప్‌-10లోకి కిదాంబి శ్రీకాంత్‌.. లక్ష్యకు కెరీర్‌ బెస్ట్‌


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి