మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్ ఐపీవో సూపర్ హిట్టైంది. 30 శాతం ప్రీమియంతో షేర్లు లిస్టయ్యాయి. ఇక 40 శాతం ఎక్కువ ధరకు ముగియడంతో ఇన్వెస్టర్లకు లాభాలు వచ్చాయి. కాగా బీఎస్‌ఈలో జరిగిన లిస్టింగ్ కార్యక్రమానికి కంపెనీ వ్యవస్థాపకులు, సీనియర్ ఉద్యోగులు హాజరయ్యారు.
ఇష్యూ ధర రూ.796తో పోలిస్తే మెడ్‌ప్లస్ షేర్లు బీఎస్‌ఈలో రూ.1015, ఎన్‌ఎస్‌ఈలో రూ.1040 వద్ద లిస్టయ్యాయి. ఆ తర్వాత మదుపర్లు కొనుగోళ్లకు దిగడంతో షేరు 1121 వద్ద ముగిసింది. అంటే ఒక్కో షేరుపై రూ.325 దాదాపుగా 40.85 శాతం లాభం వచ్చింది. ఒక లాట్‌కు 18 మెడ్‌ప్లస్ షేర్లు కేటాయించారు. దీని విలువ రూ.14,328గా ఉంది. ముగింపు ధర రూ.1121తో పోలిస్తే రూ.5850 లాభం వచ్చింది.
మెడ్ ప్లస్ ఐపీవోకు మార్కెట్ల మంచి రెస్పాన్స్ లభించింది. రిటైల్ ఇన్వె్స్టర్ల కోటాకు 53 రెట్లు ఎక్కువగా సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయర్స్ కోటాలో 112 రెట్లు బుక్ చేశారు. ఎన్‌ఐఐల కోటాకు 85 రెట్లు స్పందన వచ్చింది. ఈ ఐపీవో ద్వారా కంపెనీ రూ.1398 కోట్లు సమీకరించింది. మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్‌కు దేశవ్యాప్తంగా భారీ నెట్‌వర్క్ ఉంది. తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్రలో 2000కు పైగా స్టోర్లు ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రంగా 2006లో దీనిని ఆరంభించారు.
నోట్: స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి నష్టభయంతో కూడుకున్నది! ఇది కేవలం సమాచారం కోసమే అందిస్తున్నాం. ఫలానా స్టాక్, ఫండ్‌లో పెట్టుబడులు పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. మార్కెట్లో పెట్టుబడులు పెట్టేముందు అన్ని విషయాలు పరిశీలించుకొని, విశ్లేషించుకోవాలి. అవసరమైతే నిపుణుల సాయం తీసుకోవాలి!
Also Read: Snapdeal IPO: ఐపీవోకు స్నాప్‌డీల్.. రూ.1250 కోట్ల సమీకరణకు ముసాయిదా దాఖలు
Also Read: Card Tokenization: డెబిట్, క్రెడిట్ కార్డు టోకెనైజేషన్ గడువు పొడగించాలని ఆర్‌బీఐకి వినతి
Also Read: Tesla Smartphone: క్రేజీ ఎలన్ మస్క్! టెస్లా నుంచి మొబైల్ ఫోన్.. ఫీచర్లు ఇవే!!
Also Read: Multibagger Stock: 19 నెలల్లో రూ.లక్షకు రూ.20 లక్షల లాభం ఇచ్చే మల్టీబ్యాగర్