Cryptocurrency Prices Today, 23 December 2021: క్రిప్టో మార్కెట్లు గురువారం నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. కీలక క్రిప్టోలను ఇన్వెస్టర్లు విక్రయిస్తున్నారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ 1.66 శాతం తగ్గి రూ.38.26 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.68.62 లక్షల కోట్లుగా ఉంది.  బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథిరియమ్‌ 2.42 శాతం తగ్గి రూ.3,10,707 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ విలువ రూ.35.09 లక్షల కోట్లుగా ఉంది.


బైనాన్స్‌ కాయిన్‌ 1.33 శాతం తగ్గి రూ.41,907, టెథెర్‌ 0.07 శాతం పెరిగి రూ.79.61, సొలానా 2.70 శాతం తగ్గి రూ.14,219, రిపుల్‌ 3.47 శాతం పెరిగి రూ.78.55, కర్డానో 2.36 శాతం పెరిగి రూ.107 వద్ద కొనసాగుతున్నాయి. కేవోటీఐ, సుషి, అవె, లైవ్‌పీర్‌, లించ్‌, కాస్మోస్‌, యూనిస్వాప్‌ 8 నుంచి 20 శాతం వరకు పెరిగాయి. టెర్రా, రిక్వెస్ట్‌, ఫెచ్‌, యార్న్‌ ఫైనాన్స్‌, ది గ్రాఫ్‌, అవలాంచె, డీసెంట్రల్యాండ్‌ 2 నుంచి 10 శాతం వరకు నష్టపోయాయి.


హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్‌ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్‌ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్‌, ఎథెర్‌, డోజీకాయిన్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.


క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్‌ అసెట్‌. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్‌ డేటాబేస్‌ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.


భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, యాప్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి.


Also Read: Snapdeal IPO: ఐపీవోకు స్నాప్‌డీల్‌.. రూ.1250 కోట్ల సమీకరణకు ముసాయిదా దాఖలు


Also Read: Card Tokenization: డెబిట్‌, క్రెడిట్‌ కార్డు టోకెనైజేషన్‌ గడువు పొడగించాలని ఆర్‌బీఐకి వినతి


Also Read: Tesla Smartphone: క్రేజీ ఎలన్‌ మస్క్‌! టెస్లా నుంచి మొబైల్‌ ఫోన్‌.. ఫీచర్లు ఇవే!!


Also Read: Petrol-Diesel Price, 23 December: వాహనదారులకు గుడ్‌న్యూస్! నేడు అన్ని చోట్లా తగ్గిన ఇంధన ధరలు.. ఈ ప్రాంతాల్లో మాత్రం నిలకడగా..


Also Read: Multibagger Stock: 19 నెలల్లో రూ.లక్షకు రూ.20 లక్షల లాభం ఇచ్చే మల్టీబ్యాగర్‌