తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు స్థిరంగా ఉంది. మరోవైపు వెండి ధర స్వల్పంగా దిగొచ్చింది. బంగారం ధర ఇటీవల రూ.200 మేర పెరగగా, నిన్న ధరలో ఏ మార్పు లేదు. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.45,350 కాగా, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.49,480 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర రూ.100 మేర తగ్గడంతో హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.66,100కి పడిపోయింది. ఇటీవల 65 వేల దిగువకు పడిపోయిన వెండి ధరలు  మళ్లీ పెరుగుతున్నాయి.


ఏపీ మార్కెట్లో బంగారం ధర రూ.200 మేర పెరగగా, వెండి ధరలు దిగొచ్చాయి. విజయవాడలో 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,480 అయింది.. 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.45,350కు చేరింది. ఇక విశాఖపట్నం మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,480 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,350 కు ఎగబాకింది. వెండి ధరలు ఏపీ, తెలంగాణలో ఒకే రేట్లలో విక్రయాలు జరుగుతున్నాయి. ఏపీ మార్కెట్లో కేజీ వెండి ధర రూ.66,100గా ఉంది.


దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశ రాజధాని ఢిల్లీ సహా ప్రధాన నగరాల్లో మాత్రం బంగారం ధరలు నేడు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో బంగారం ధర నిలకడగా ఉంది. ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.47,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,800గా ఉంది. చెన్నైలో బంగారం ధర రూ.50 మేర తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,650 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,510 అయింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,300 వద్ద మార్కెట్ అవుతోంది.


ప్లాటినం ధరలో పెరుగుదల
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు రూ.10 మేర పెరిగింది. ముంబైలో 10 గ్రాముల బంగారం ధర రూ.23,470 అయింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.23,420 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర రూ.22,470 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.


పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: Four Day Work Week: 4 రోజులే పని.. పెరగనున్న బేసిక్‌ పే.. మారనున్న సాలరీ స్ట్రక్చర్‌!


Also Read: Telangana IPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్ ల బదిలీ...హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్... ఏసీబీ డీజీగా అంజనీ కుమార్


Also Read: Delmicron Varient: ఒమిక్రాన్ తర్వాత పొంచి ఉన్న మరో వేరియంట్, ఆ రెండూ కలిసిపోయి కొత్తగా.. దీని తీవ్రత ఎంతంటే..!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి