యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌... ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి వీళ్లిద్ద‌ర్నీ ఒక్క తెర మీద‌కు తీసుకొచ్చారు. వీళ్లిద్ద‌రూ హీరోలుగా 'ఆర్ఆర్ఆర్: రౌద్రం ర‌ణం రుధిరం' చేశారు. సినిమాలో తార‌క్‌, చ‌ర‌ణ్ స్నేహితులుగా న‌టించారు. ట్రైల‌ర్‌లో 'నా ప్రాణం క‌న్నా విలువ‌లైన నీ సోప‌తి (స్నేహం) నాకు ద‌క్కింది. గ‌ర్వంగా ఈ మ‌న్నులో క‌లిసిపోతా' అని ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ కూడా ఉంటుంది. నిజ జీవితంలో వీళ్లిద్ద‌రూ స్నేహితులేనా? లేదంటే సినిమాలో, సినిమా కోసం న‌టిస్తున్నారా? వంటి ప్న‌శ్న‌ల‌కు గ‌తంలోనే ఎన్టీఆర్ స‌మాధానం ఇచ్చారు.

'ఆర్ఆర్ఆర్' వ‌ల్ల తామిద్దం స్నేహితులం కాలేద‌ని, 'ఆర్ఆర్ఆర్' సినిమా కంటే ముందు నుంచి చ‌ర‌ణ్‌కు, త‌న‌కు మ‌ధ్య స్నేహం ఉంద‌ని ఎన్టీఆర్ తెలిపారు. హైద‌రాబాద్‌లో జ‌రిగిన ప్రెస్‌మీట్‌లో ఎన్టీఆర్‌కు చ‌ర‌ణ్ కిత‌కిత‌లు పెట్ట‌డం, ఇద్ద‌రి మ‌ధ్య బాండింగ్‌ను ప్రేక్ష‌కులూ చూశారు. తాజాగా కేర‌ళ‌లో జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రామ్‌చ‌ర‌ణ్ "నాలో ఇంకో భాగం, నా సెకండ్ హాఫ్ నా బ్ర‌ద‌ర్. త‌ను లేకుండా ఈ సినిమా సాధ్యం అయ్యేది కాదు" అని చెప్పారు.


"చ‌ర‌ణ్ /త‌న‌లో స‌గం" అని ఎన్టీఆర్ అన్నారు. "ఏ స‌గం అని అడిగితే... లైఫ్ సైడ్ హాఫ్ అని చెబుతాను. ఎందుకంటే... హార్ట్ అక్క‌డే ఉంది" అని చెప్పి ఆడియ‌న్స్ హార్ట్‌ను ఎన్టీఆర్ ట‌చ్ చేశారు. రామ్ చ‌ర‌ణ్‌తో త‌న ఫ్రెండ్షిప్‌, బాండింగ్ గురించి ఎక్కువ చెప్పి దీన్నో ప‌బ్లిసిటీ స్టంట్ చేయాల‌నుకోవ‌డం లేద‌ని ఆయ‌న పేర్కొన్నారు. "దేవుడికి ధ‌న్య‌వాదాలు చెబుతున్నాను... రెండొంద‌ల రోజులు నా బ్ర‌ద‌ర్ (రామ్ చ‌ర‌ణ్‌)తో కూర్చుని గ‌డిపే క్ష‌ణాలు నాకు ఇచ్చినందుకు! ఈ బంధం కేవ‌లం 'ఆర్ఆర్ఆర్‌'తో ముగిసిపోతుందని నేను అనుకోవ‌డం లేదు. ఎందుకంటే... 'ఆర్ఆర్ఆర్' కంటే ముందు మొద‌లైంది. మా జీవితాల్లో మేం ఇలాగే క‌లిసి ఉండాల‌ని ప్రార్థించ‌మ‌ని దేవుడిని, అభిమానులు అంద‌ర్నీ ప్రార్థిస్తున్నాను" అని ఎన్టీఆర్ అన్నారు.


రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు.