తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఏపీ బిగ్గెస్ట్ మార్కెట్. వసూళ్లలో మెజార్టీ షేర్ అక్కడి నుంచి వస్తుంది. 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' పాన్ ఇండియా సినిమా అయినప్పటికీ... ఏపీలో సినిమాను దగ్గర దగ్గర రూ. 150 కోట్లకు అమ్మారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న టికెట్ రేట్స్ దృష్ట్యా అంత వసూలు చేసే కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందా? అంటే... లేదు. టికెట్ రేట్స్ యూనిఫార‌మ్‌గా రూ. 200, రూ. 300 అమ్మితే తప్ప రాదు. రేట్స్ పెంచుకోవడం మాట అటుంచితే... థియేటర్లకు తాళాలు పడటంతో 'ఆర్ఆర్ఆర్' అమ్మకాల్లో, వసూళ్లలో కోతలు తప్పవని అందరూ భావించారు. అయితే... ఇప్పుడు సీజ్ చేసిన థియేటర్లు తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో 'ఆర్ఆర్ఆర్'కు ప్లస్ అవుతుందని చెప్పాలి.
Also Read: Movie Ticket Rates Issue: టికెట్ రేట్స్ ఇష్యూ... ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీలో సభ్యులు వీరే!
ఏపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవో 35 పెద్ద కలకలం సృష్టించింది. ప్రభుత్వం సూచించిన రేట్లకు తాము టికెట్స్ అమ్మలేమని కొంతమంది ఓనర్లు స్వచ్ఛందంగా థియేటర్లు మూసి వేశాయి. నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటలోని 'వి ఎపిక్' వంటి భారీ స్క్రీన్స్ సైతం మూతపడ్డాయి. అధికారులు తనిఖీలు చేసి కొన్ని థియేటర్లకు తాళాలు వేశారు. తనిఖీల నుంచి తప్పించుకోవడానికి కొంత మంది థియేటర్లకు తాళాలు వేసి, టికెట్ రేట్స్ సాకుగా చూపుతున్నారనే విమర్శ కూడా ఉంది. ఇవన్నీ పక్కన పెడితే... సీజ్ చేసిన థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతులు ఇచ్చారు. దీంతో 'ఆర్ఆర్ఆర్' విడుదల అయ్యే థియేటర్ల సంఖ్య పెరుగుతుంది.
Also Read: టికెట్స్ ఇష్యూ పరిష్కారానికి తొలి అడుగు... ఏపీ సీయం అపాయింట్మెంట్ కోసం టాలీవుడ్ వెయిటింగ్!
జస్ట్... థియేటర్లు మాత్రమే తెరుచుకుంటే సరిపోదు. టికెట్ రేట్స్ కూడా పెరగాలి. అప్పుడు మాత్రమే 'ఆర్ఆర్ఆర్'కు లాభాలు వస్తాయి. ఆల్రెడీ టికెట్ రేట్స్ పరిశీలనకు ఏపీ ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. ఆ కమిటీ రిపోర్ట్ జనవరి 6కి ముందు వస్తుందో? లేదో? చూడాలి.


Also Read: సీజ్‌ చేసిన సినిమా థియేటర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. మంత్రి వెల్లడి
Also Read: Tollywood 2021 Review: కాలర్ ఎగరేసిన కమర్షియల్ సినిమా... దుమ్ము దులిపేసిన స్టార్స్!
Also Read: యువరానర్... వీళ్లే ఈ ఏడాది ఆన్-స్క్రీన్ లాయర్స్!
Also Read: Telugu Hero Vs Tamil Hero 2021: సామాన్యుడికి దూరంగా తెలుగు హీరో!? మనలో ఒకడిగా కనిపించలేరా!?
Also Read: Item Songs of the Year 2021: సెక్సీ లేడీస్... ఐటమ్ సాంగ్స్ అదుర్స్!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.