ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 35 మీద చలనచిత్ర పరిశ్రమకు, పంపిణీ, ప్రదర్శన రంగాలకు చెందిన వ్యక్తులు అసంతృప్తితో ఉన్నారు. ఏపీలో పలు ప్రాంతాల్లో థియేటర్లను స్వచ్ఛందంగా మూసి వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సినిమా టికెట్ రేట్స్ అంశాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వం ఓ కమిటీ ఏర్పాటు చేయనుంది. సోమవారం నిర్మాత 'దిల్' రాజు కూడా ఈ విషయం వెల్లడించారు.


టికెట్ రేట్స్ సమస్య పరిష్కారం, రాష్టంలో సినిమా టికెట్ ధరల అంశాన్ని పరిశీలించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీకి ఛైర్మ‌న్ అండ్ క‌న్వీన‌ర్‌గా రాష్ట్ర హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో సభ్యులుగా అధికార యంత్రాంగం నుంచి రెవెన్యూ, పురపాలక - పట్టణాభివృద్ధి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులతో పాటు సమాచార - పౌర సంబంధాల శాఖ కమిషనర్, న్యాయ శాఖ కార్యదర్శి, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఉండనున్నారు.
Also Read: టికెట్ రేట్స్ ఇష్యూ పరిష్కారానికి తొలి అడుగు... ఏపీ సీయం అపాయింట్మెంట్ కోసం టాలీవుడ్ వెయిటింగ్
సినిమా, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ సెక్టార్స్ నుంచి సభ్యులుగా కొంత మందికి కమిటీలో ప్రాధాన్యం కల్పిస్తున్నట్టు తెలిసింది. ఎగ్జిబిటర్స్ నుంచి మచిలీపట్నానికి చెందిన శ్రీకృష్ణ థియేటర్స్ అధినేత వేమూరి బలరత్నం, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి తుమ్మల సీతారామ ప్రసాద్, సినిమా పరిశ్రమ నుంచి  తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ ముత్యాల రాందాస్‌ను కమిటీలో సభ్యులుగా నియమించినట్టు సమాచారం. ప్రముఖ పాత్రికేయులు, సెన్సార్ బోర్డు సభ్యులు వడ్డి ఓం ప్రకాశ్ నారాయణ, నంద్యాలకు చెందిన డా. జూపల్లె రాకేష్ రెడ్డి, విజయ నగరానికి చెందిన గంప లక్ష్మికి సినీ గోయర్స్ అసోసియేషన్ తరఫున కమిటీలో స్థానం కల్పించారు. నేడు ఈ కమిటీకి సంబంధించి జీవో విడుదల అయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఈ రోజు ఏపీ మంత్రి పేర్ని నానితో ఎగ్జిబిటర్లు సమావేశం కానున్నారు. 
Also Read: థియేటర్ కంటే కిరాణా కొట్టు పెట్టుకోవడం బెటర్... ఏపీ ప్రభుత్వం మీద నాని సెటైర్స్
Also Read: నానికి టికెట్ రేట్స్, కలెక్షన్స్ గురించి ఐడియా ఉందా? - ఏపీ ప్రభుత్వానికి మద్దతుగా నిర్మాత నట్టి
Also Read: ఏపీ సర్కార్ వారి సినిమా టికెట్ల ధరలివే.. మీ ఊర్లో సింగిల్ టీ కంటే సినిమా టికెట్ రేటే చీప్
Also Read: సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తే అవమానం ఎలా అవుతుంది... థియేటర్లపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేయడం లేదు... హీరో నానికు మంత్రి బొత్స కౌంటర్
Also Read: హీరో నాని ఎవరో తెలీదు.. నాకు కొడాలి నానీనే తెలుసు, బైక్ అమ్మి పవన్ కల్యాణ్ కటౌట్లు కట్టా: మంత్రి అనిల్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి