తెలంగాణలో టికెట్ రేట్స్ పెంచుకునే విధంగా జీవో వచ్చినట్టు, త్వరలో ఏపీలోనూ జీవో వస్తుందని ఆశిస్తున్నట్టు ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు తెలిపారు. ఏపీలో గత కొన్ని రోజులుగా స్వచ్ఛందంగా థియేటర్లను యాజమాన్యాలు మూసి వేస్తున్నాయి. ఇప్పటివరకు సుమారు 175 థియేటర్లు మూత పడినట్టు సమాచారం. మరోవైపు టికెట్ రేట్స్ గురించి గతంలో పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలు సంచలనం అయ్యాయి. ఇటీవల హీరో నాని మాట్లాడిన మాటలు కూడా చర్చనీయాంశం అయ్యాయి. ఈ నేపథ్యంలో పరిశ్రమకు చెందిన వ్యక్తులు ఎవరూ వ్యక్తిగతంగా మాట్లాడవద్దని ఆయన కోరారు.
పరిశ్రమకు చెందిన సమస్యలపై చర్చలు జరపడానికి ఓ కమిటీని ఏర్పాటు చేయవలసిందిగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కౌన్సిల్ (టీఎఫ్‌సీసీ)కి ఏపీ ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చిందని 'దిల్' రాజు పేర్కొన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుందని 'దిల్' రాజు, 'స్రవంతి' రవికిశోర్ తదితరులు తెలిపారు. ఛాంబర్ కొంత మంది పేర్లు ఇచ్చిందని, త్వరలో కమిటీ వివరాలను ప్రభుత్వమే వెల్లడిస్తుందని ఆయన తెలిపారు. కమిటీ ఉంటే చర్చలు జరపడానికి సులభతరం అవుతుందని ఆయన అన్నారు. టికెట్ రేట్స్ విషయంలో నిర్మాతలకు, విద్యుత్ బిల్లుల విషయంలో ఎగ్జిబిటర్లు... ఈ విధంగా పరిశ్రమకు వివిధ శాఖలకు సమస్యలు ఉన్నాయని 'దిల్' రాజు అన్నారు. ఏపీ మంత్రి పేర్ని నానితో జరిగిన ఎగ్జిబిటర్ల సమావేశానికి, కమిటీకి సంబంధం లేదన్నారు. తాము ప్రతి విషయాన్ని పాజిటివ్‌గా చూస్తున్నామని అన్నారు. ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, త్వరలో సమస్యలు పరిష్కరిస్తుందని, పాత రోజులు వచ్చి అద్భుతంగా ఉంటుందని 'దిల్' రాజు ధీమా వ్యక్తం చేశారు.
Also Read: సినిమా టికెట్ల విక్రయాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... ఐఆర్సీటీసీ తరహాలో ఏపీఎఫ్‌డీసీకు బాధ్యతలు అప్పగింత....
ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం దృష్టికి సమస్యలు సరిగా తీసుకు వెళ్లలేదని తాము భావిస్తున్నామని 'దిల్' రాజు అన్నారు. అలాగే, ఏపీ సీయం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నట్టు 'దిల్' రాజు తెలిపారు. అపాయింట్మెంట్ వస్తే... సీయంతో పాటు ఏపీ ప్రభుత్వ ప్రతినిధులను కలవాలని అనుకుంటున్నట్టు ఆయన తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రతినిధులను మాత్రమే కాదు, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులను కూడా కలుస్తామని ఆయన స్పష్టం చేశారు.
Also Read: థియేటర్ కంటే కిరాణా కొట్టు పెట్టుకోవడం బెటర్... ఏపీ ప్రభుత్వం మీద నాని సెటైర్స్
Also Read: నానికి టికెట్ రేట్స్, కలెక్షన్స్ గురించి ఐడియా ఉందా? - ఏపీ ప్రభుత్వానికి మద్దతుగా నిర్మాత నట్టి
Also Read: ఏపీ సర్కార్ వారి సినిమా టికెట్ల ధరలివే.. మీ ఊర్లో సింగిల్ టీ కంటే సినిమా టికెట్ రేటే చీప్
Also Read: ఇద్దరు, ముగ్గురు సినిమా హీరోలపై కక్షతో పరిశ్రమను దెబ్బతిస్తారా?
Also Read: సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తే అవమానం ఎలా అవుతుంది... థియేటర్లపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేయడం లేదు... హీరో నానికు మంత్రి బొత్స కౌంటర్
Also Read: హీరో నాని ఎవరో తెలీదు.. నాకు కొడాలి నానీనే తెలుసు, బైక్ అమ్మి పవన్ కల్యాణ్ కటౌట్లు కట్టా: మంత్రి అనిల్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి