వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును తెలంగాణ హైకోర్టు రిజర్వ్ చేసింది.  గతంలో తాను దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణ అనంతరం సీబీఐ కోర్టు కొట్టి వేయడంతో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ కాలం తర్వాత రెండు వారాల క్రితం విచారణకు వచ్చింది. సీఎం జగన్‌కు నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఇప్పుడు ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.  


Also Read: ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల ఫీజులను మీరెలా నిర్ణయిస్తారు ? ఏపీ ప్రభుత్వ జీవోలను కొట్టివేసిన హైకోర్టు !


సీఎం జగన్‌తో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని  రఘురామృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. సీఎంగ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీఎం జగన్‌పై 11 చార్జ్‌షీట్లు ఉన్నాయని ఎంపీ రఘురామ తరఫున న్యాయవాది కోర్టుకి తెలిపారు. సీఎం జగన్ బెయిల్ రద్దు చేసి 11 చార్జ్‌షీట్లను విచారించాలని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. సీఎంగా ఉన్నందున సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారని.. సహ నిందితులగా కీలకమైన పదవులు కట్ట బెడుతున్నారని వాదించారు. అయితే సీబీఐ మాత్రం ఈ విషయంలో అఫిడవిట్ దాఖలు చేసేందుకు నిరాకరించింది. కేసు మెరిట్‌ను బట్టి నిర్ణయం తీసుకోవాలని సీబీఐ కోర్టుకు చెప్పింది. దీంతో సీబీఐ కోర్టు బెయిల్ రద్దు చేయడానికి నిరాకరిస్తూ... రఘురామకృష్ణరాజు పిటిషన్లను కొట్టి వేసింది.  


Also Read: వంగవీటిపై దాడికి రెక్కీ నిర్వహించిందెవరు ? పోలీసులు అంతర్గత విచారణ ప్రారంభించారా?


హైకోర్టులో ఇప్పటికే జగన్‌కు సంబంధించిన మరో కీలకమైన పిటిషన్ తీర్పు రిజర్వ్‌లో ఉంది.  సీఎంగా ఉన్నందున బాధ్యతలు నిర్వహించాల్సి ఉన్నందున సీబీఐ కోర్టులో జరుగుతున్న అక్రమాస్తుల కేసుల విచారణకు వ్యక్తిగతంగా హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలని జగన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టి వేయడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ కూడా పూర్తయింది. తీర్పు రిజర్వ్ అయింది. ఆ కేసులోనూ తీర్పు రావాల్సి ఉంది.  జగన్‌కు సంబంధించిన రెండు కీలక కేసుల్లో తీర్పు రిజర్వ్ కావడంతో వైఎస్ఆర్‌సీపీ నేతల్లో ఉత్కంఠ ప్రారంభమయింది. 


Also Read: జనవరి 28న రాజధాని పిటిషన్లపై పూర్తి స్థాయి వాదనలు.. విచారణ కొనసాగించాలని రైతుల విజ్ఞప్తి !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి