ఏపీ సర్కారు ఇటీవల ఆన్ లైన్ సినిమా టికెటింగ్ విధానం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో సినిమా టికెట్ల కొత్త రేట్లను నేడు ప్రకటించింది. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ, గ్రామ పంచాయతీ ప్రాంతాల్లోని మల్టీప్లెక్సులు, సినిమా థియేటర్లకు వివిధ రకాల రేట్లను నిర్దేశించింది. సవరించిన ధరల ప్రకారం... అత్యంత కనిష్ట ధర రూ.5 కాగా, అత్యంత గరిష్ట ధర రూ.250గా పేర్కొన్నారు. అంతేకాదు.. ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి ఉండదని తెలుస్తోంది.


మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో...



  1. మల్టీప్లెక్సు- ప్రీమియం రూ.250, డీలక్స్ రూ.150, ఎకానమీ రూ.75

  2. ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.100, డీలక్స్ రూ.60, ఎకానమీ రూ.40

  3. నాన్ ఏసీ- ప్రీమియం రూ.60, డీలక్స్ రూ.40, ఎకానమీ రూ.20


మున్సిపాలిటీ ప్రాంతాల్లో...



  1. మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.150, డీలక్స్ రూ.100, ఎకానమీ రూ.60

  2. ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.70, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30

  3. నాన్ ఏసీ- ప్రీమియం రూ.50, డీలక్స్ రూ.30, ఎకానమీ రూ.15


నగర పంచాయతీల్లో...



  1. మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.120, డీలక్స్ రూ.80, ఎకానమీ రూ.40

  2. ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.35, డీలక్స్ రూ.25, ఎకానమీ రూ.15

  3. నాన్ ఏసీ- ప్రీమియం రూ.25, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10


గ్రామ పంచాయతీ ప్రాంతాల్లో...



  1. మల్టీప్లెక్స్-  ప్రీమియం రూ.80, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30

  2. ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.20, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10

  3. నాన్ ఏసీ- ప్రీమియం రూ.15, డీలక్స్ రూ.10, ఎకానమీ రూ.5


Also Read: 'సిరివెన్నెల'కు నివాళిగా... 'భీమ్లా నాయక్', 'ఆర్ఆర్ఆర్' బాటలో 'రాధే శ్యామ్' కూడా!


Also Read: వరద బాధితులకు ఎన్టీఆర్ సాయం.. ఫ్యూచర్ సీఎం అంటూ కామెంట్స్..


Also Read: అలియా లెహంగాను తన్నిన రణబీర్.. బ్రేకప్ చెప్పమంటున్న నెటిజన్లు..


Also Read: పడి లేచిన వాడితో పందెం చాలా ప్రమాదకరం... 'లక్ష్య' ట్రైలర్ చూశారా?


Also Read: సీతారాముడూ వెళ్లిపోయాడు.. ఇన్నాళ్లూ వెన్నెల కురింపించి.. నేడు చీకట్లలో వదిలేసి..


Also Read: థియేటర్లు దొరక్క... పదిహేను రోజులు వెనక్కి వెళ్లిన పూర్ణ సినిమా