'ఎక్స్ట్రా జబర్దస్త్' కార్యక్రమంలో కమెడియన్ ఇమ్మాన్యుయేల్, లేడీ ఆర్టిస్ట్ వర్ష మధ్య ఏదో జరుగుతుంది అన్నట్టు చూపిస్తూ ఉంటారు. అయితే... వాళ్ల మధ్య ఏమీ లేదని టీఆర్పీ కోసం షో డైరెక్టర్లు చేస్తున్న జిమ్మిక్కులు అనే వాదన కూడా ఉంది. ఓ స్కిట్‌లో వాళ్ల మధ్య ఏమీ లేదని, వర్ష వదిలేయడంతో ఇమ్మాన్యుయేల్ టీ ఇవ్వాల్సి వస్తుందన్నట్టు కామెడీ చేశాడు. అది పక్కన పెడితే... లేటెస్టుగా విడుదల అయిన 'ఎక్స్ట్రా జబర్దస్త్' ప్రోమో చూస్తే నిజంగా వాళ్లిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది.
స్కిట్ కంప్లీట్ అయిన తర్వాత జడ్జ్‌మెంట్ ఇచ్చే సమయంలో 'మీరిద్దరూ ఎక్కడికి వెళ్లారు చెప్పు... రెండు రోజుల ముందు' అని ఇమ్మాన్యుయేల్‌ను రోజా ప్రశ్నించారు. 'నేను ఊరు వెళ్లాను మేడమ్' అని అతడు సమాధానం ఇచ్చాడు. 'నేను షూటింగ్ లో ఉన్నాను మేడమ్' అని వర్ష జవాబు ఇచ్చింది. 'మరి, ఈ ఫొటో... రెండు రోజుల ముందు, ఎక్కడో కారులో ఇద్దరూ షికారులు చేస్తున్నట్టు' అని రోజా తన ఫొనులో ఓ ఫొటో తీసి చూపించారు. ఆ ఫొటోలో కారులో కూర్చని సరదాగా కబుర్లు, కథలు చెప్పుకొంటున్న వర్ష, ఇమ్మాన్యుయేల్ ఉన్నారు. చిరునవ్వులు చిందిస్తున్నారు. రోజా ఫొటో చూపిస్తుంటే వద్దన్నట్టు వర్ష సైగలు చేసింది.
కారులో వర్ష, ఇమ్మాన్యుయేల్ ఉన్న ఫొటో రెండు రోజుల ముందు తీసినదని రోజా చెప్పారు. జాగ్రత్తగా గమనిస్తే... షోలో వాళ్లిద్దరూ వేసుకున్న డ్రస్సులు, ఫొటోలు ఉన్న డ్రస్సులు సేమ్ అని అర్థం అవుతోంది. ఒకవేళ 'ఇది కూడా ప్లాన్ చేసి తీసినది ఏమో!' అని కొందరి సందేహం. ఏది ఏమైనా వీళ్లిద్దరి ట్రాక్ వీక్షకులను అట్ట్రాక్ట్ చేస్తోంది. సోషల్ మీడియాలో వర్ష ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బావుంది. Extra Jabardasth Latest Promo: