తల్లి ఆరోగ్యంగా ఉంటేనే, ఆమె గర్భం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. గర్భాధారణ, గర్భం ఎలాంటి సమస్యలు లేకుండా హెల్తీగా ఉంటేనే పండంటి బిడ్డ పుట్టేంది. అంటే బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలంటే తల్లి ఆరోగ్యం బావుండాలని అర్థం. అందుకే గర్భం దాల్చడానికి ముందే, అంటే ప్లానింగ్లో ఉన్నప్పుడే కొన్ని రకాల పరీక్షలు చేయించుకోవాలి. ఆ పరీక్షల్లో తేడాగా ఏది అనిపించినా ఆ సమస్యకు చికిత్స తీసుకోవాలి. తల్లి సంపూర్ణ ఆరోగ్యవంతురాలయ్యాకే గర్భం దాల్చేందుకు సిద్ధపడాలి. చేయించుకోవాల్సిన టెస్టులు ఇవే...


రుబెల్లా...
ఎర్రటి దద్దుర్లుతో వచ్చే అంటువ్యాధి ఇది. ఈ రుబెల్లా వైరస్ ను  తట్టుకునే యాంటీ బాడీలు మీ శరీరంలో ఉన్నాయో లేదో తెలుసుకునే టెస్టులు చేయించుకోవాలి. 


చికెన్ పాక్స్ (అమ్మవారు)
ఇది కూడా ఎర్రటి దద్దుర్లు, పెద్ద కురుపులతో వచ్చే అంటువ్యాధి. ఇది తల్లి నుంచి బిడ్డకు అంటుకునే ప్రమాదం ఉంది. తల్లికి ఈ వైరస్ కూడా లేదని గర్భం దాల్చడానికి ముందే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 


హెచ్ఐవి
తల్లి నుంచి బిడ్డకు వచ్చే ప్రమాదకరమైన వైరస్ ఇది. రక్తం ద్వారా ఇది బిడ్డకు చేరుతుంది. జీవితాంతం బిడ్డని వెంటాడే సమస్య ఇది. 


హెర్పెస్
తల్లికి లైంగికంగా సంక్రమించే వ్యాధి ఇది. గర్భం దాల్చకముందే హెర్పెస్ ఉందో లేదో చెక్ చేయించుకోవాలి. హెర్పెస్ టెస్టులో గర్భవ్యవస్థ ఆరోగ్యం కూడా తేలిపోతుంది. 


హెపటైటిస్ బి ఇమ్యూనిటీ
ఆరోగ్యకరమైన బిడ్డ కోసం హెపటైటిస్ బి ఇమ్యూనిటీ ఉందో లేదో కూడా చెక్ చేయించుకోవాలి. 


థైరాయిడ్ టెస్టు
థైరాయిడ్ గ్రంథి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (టీఎస్‌హెచ్)ను ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేస్తుందో చెక్ చేసుకోవాలి. ఆరోగ్యకరమైన గర్భానికి హార్మోన్ల సమతుల్యత చాలా అవసరం. 


థలసేమియా
ఇదో భయంకరమైన ఆరోగ్య పరిస్థితి. ఇది వారసత్వంగా వచ్చే వ్యాధి కూడా. కాబట్టి టెస్టులు చేయించుకుంటే మంచిది.  



Also Read: కొత్త ఏడాదిలో ధనవంతులవ్వాలని ఆశపడుతున్నారా? ఇంట్లో ఈ వస్తువులు ఉండేలా చూసుకోండి...
Also Read: టీ ప్రేమికులందరికీ ఓ ప్రశ్న... రోజూ మీరు తాగే టీ మిమ్మల్ని లావుగా చేస్తోందని తెలుసా?





ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.