Calcium: ఈ లక్షణాలు కనిపిస్తే కాల్షియం లోపం ఉన్నట్లే... తేరుకోకపోతే ఎముకల వ్యాధులు వచ్చే అవకాశం

మనశరీరంలోని ఎముకలకు కావాల్సిన ముఖమైన పోషకం కాల్షియం.

Continues below advertisement

మానవశరీరానికి అత్యవసరమైన పోషకాల్లో కాల్షియం ఒకటి. ఎముకలు, దంతాల పెరుగుదల్లో దీనిదే కీలక పాత్ర. ఇది లోపిస్తే చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల వ్యాధులు రావచ్చు. దీనివల్ల ఎముకలు గుల్లబారిపోతాయి. ఎముకలు బలహీనంగా మారి ఏ బరువును మోయలేరు. అంతేకాదు ఎముకల నొప్పులు కూడా భరించలేరు. హైబీపీ కూడా వచ్చే అవకాశం ఎక్కువ. పిల్లల్లో ఈ లోపం తలెత్తితే ఎదుగుదల ఆగిపోతుంది. కాబట్టి కాల్షియం రోజువారీ ఆహారంలో ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. 

Continues below advertisement

లక్షణాలు ఇలా...
కాల్షియం లోపం పెద్దల్లోనే కాదు, చిన్నారుల్లో కూడా కనిపిస్తుంది. వీరిలో కండరాలు పట్టినట్టు అయిపోతాయి. కీళ్లు, కండరాల నొప్పులు ఎక్కువవుతాయి. చిన్నపనికే అలసటగా అనిపిస్తుంది. కాళ్ల కింద సూదులతో పొడిచినట్టు అనిపిస్తుంది. బరువైన వస్తువులను ఎత్తలేరు. ఏ వస్తువును ఎక్కువసేపు పట్టుకోలేరు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించడం మేలు. కాల్షియం లోపం మరీ తీవ్రంగా ఉంటే ఆయన కాల్షియం సప్లిమెంట్లు రాసిస్తారు. లేకుంటే కాల్షియం కోసం ఏ ఆహార పదార్ధాలు తినాలో వివరిస్తారు. 

ఏం తినాలంటే...
గోధుమలతో  రోజూ ఒక పూట చపాతి చేసుకుని తినాలి. అది కూడా బంగాళాదుంప కూరతో పాటూ తినాలి. ఎందుకంటే గోధుమలు, బంగాళాదుంప... రెండింటిలోనూ కొంత స్థాయిలో కాల్షియం ఉంటుంది.  అధికంగా కావాలంటే రోజూ బాదం పప్పు, పిస్తా, వాల్‌నట్స్ వంటివి ఓ గుప్పెడు తినాలి. బెల్లంలో ఐరన్ తో పాటూ కాల్షియం కూడా లభిస్తుంది. పాలు, పెరుగు కాల్షయానికి మంచి  మూలాలు. కొత్తిమీర, మెంతులు వంటి ఆకుకూరల్లో కూడా ఈ పోషకం పుష్కలంగా ఉంటుంది. సోయా చంక్స్, రాగులు, మినుములు, పుదీనా, ధనియాలు, చేపలు, కోడి గుడ్లు, కొబ్బరి, చిలగడదుంపలు, కాలీ ఫ్లవర్ వంటి వాటిలో కూడా కాల్షియం లభిస్తుంది. కాబట్టి వీటిని రోజూ వారీ ఆహారంలో ఉండేట్టు చూసుకోవాలి. 

గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.

Also Read: కొత్త ఏడాదిలో ధనవంతులవ్వాలని ఆశపడుతున్నారా? ఇంట్లో ఈ వస్తువులు ఉండేలా చూసుకోండి...
Also Read: టీ ప్రేమికులందరికీ ఓ ప్రశ్న... రోజూ మీరు తాగే టీ మిమ్మల్ని లావుగా చేస్తోందని తెలుసా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.
Continues below advertisement