బరువు తగ్గాలనుకునేవారంతా చేసే మొదటి పని అన్నం తినడం తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం. కానీ అన్నాన్ని పూర్తిగా మానేయడం వల్ల కలిగే నష్టాలను సెలెబ్రిటీ న్యూట్రిషనిస్టు రుజుతా దివేకర్ వివరించారు. తన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అన్నం తినడం వల్ల కలిగే ప్రయోజనాలను చెప్పారు. బరువు పెరగడానికి కేవలం రైస్ మాత్రమే కారణం కాదు, మిగతా ఆహారాన్ని కూడా తగ్గిస్తూ, అన్నాన్ని తినడం చాలా అవసరం. రోజులో మూడు పూటల్లో కనీసం ఒక పూటైనా అన్నం తినాల్సిన అవసరం ఉంది. 


ఎంతో ఆరోగ్యం...
1. అన్నం ప్రీబయోటిక్‌గా పనిచేస్తుంది. దీన్ని తినడం వల్ల పొట్టలోని మంచి సూక్ష్మజీవుల వ్యవస్థలకు మేలు చేస్తుంది. వాటికి ఆహారాన్ని అందిస్తుంది. మన పొట్ట, పేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ మంచి బ్యాక్టిరియాలు చాలా అవసరం. 


2. ఎక్కువ పాలిష్ చేసిన బియ్యాన్ని తినడం వల్ల పెద్దగా ప్రయోజనాలు ఉండవు. సింగిల్ పాలిష్ చేసిన బియ్యంలో వండుకున్న ఆహారాలో పోషకాలు ఎక్కువ. గంజి నుంచి ఖీర్ వరకు ఎలా తిన్నా మంచిదే. 


3. అన్నం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయంటారు. కానీ అన్నాన్ని తక్కువగా తీసుకుని, అందులో పప్పు, కూరలు, నెయ్యి వంటివి వేసుకుని తింటే చక్కెర స్థాయిలు పెరగకుండా స్థిరంగా ఉంటాయి. 


4. అన్నం త్వరగా జీర్ణమవుతుంది. పొట్ట కూడా తేలికగా అనిపిస్తుంది. నిద్ర వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. హార్మోన్ల సమతుల్యతకు సహకరిస్తుంది. 


5. చర్మానికి చాలా మేలు చేస్తుంది అన్నం. చర్మ రంధ్రాలను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. 


6. జుట్టు పెరుగుదులను మెరుగుపరుస్తుంది. 


7. బియ్యంలోని ప్రతి భాగంలో పోషకాలు ఉంటాయి. ప్రతి భాగం ఉపయోగపడుతుంది. గింజల్ని మనం తింటే పైన పొట్టును పశువులు తింటాయి. 


8. వరి పంట అద్భుతమైనది. పప్పు ధాన్యాలు పెరగడానికి నేలలో తగినంత తేమను వదిలివేస్తుంది. ఇది సహజ నత్రజని ఫిక్చర్ గా పనిచేసి, నేలను సుసంపన్నం చేస్తుంది. 




Also Read: కొత్త ఏడాదిలో ధనవంతులవ్వాలని ఆశపడుతున్నారా? ఇంట్లో ఈ వస్తువులు ఉండేలా చూసుకోండి...
Also Read: టీ ప్రేమికులందరికీ ఓ ప్రశ్న... రోజూ మీరు తాగే టీ మిమ్మల్ని లావుగా చేస్తోందని తెలుసా?


Also Read: ఛీ... అద్దెకున్నవాళ్లు ఇలా కూడా చేస్తారా? పాపం ఆ ఓనర్
Also Read: ఇంజెక్షన్ అంటే భయమా? మీలాంటివాళ్ల కోసమే సూది లేని ఇంజెక్షన్లు వస్తున్నాయి...















ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.