గత కొన్నేళ్లుగా శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు, ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఒక వ్యక్తి ముఖంపై పడే ముడతలకు, అతడు జీవించేకాలానికి మధ్య సంబంధాన్ని నిర్ధారించేందుకు ఎంతో కాలం నుంచి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఆ రెండింటి మధ్య సమీకరణాన్ని ఛేదించినట్టే కనిపిస్తోంది. 


ముడతలు కేవలం వయసుమీరితేనే రావు, ఒక వ్యక్తి జీవనశైలి, జన్యువులు, కాలుష్యం వంటివి కూడా ముఖ్యపాత్రను పోషిస్తాయి. మొదట శాస్త్రవేత్తలు గుండె జబ్బులు, నుదుటిపై ముడతలకు మధ్య ఉన్న సంబంధాన్ని తేల్చేందుకు ఎన్నో పరిశోధనలు చేశారు. ఇందుకోసం 32 నుంచి  62 ఏళ్ల మధ్య వయస్సు గల 3200 మంది ఆరోగ్యవంతులైనవారిని ఎంపిక చేసుకున్నారు. వారి నుదిటి నమూనాలను సేకరించారు. వాటిపై ముడతల లోతు, ముడతల సంఖ్య వంటి వివరాలు విశదీకరించారు. సున్నా పాయింట్లు అంటే ముడతలు లేవని అర్థం, మరీ లోతైన ముడతలు ఉంటే మూడు పాయింట్లు ఇచ్చారు. దాదాపు 20 ఏళ్ల పాటు వారిని గమనించారు. 


ఈ ఇరవైఏళ్లలో మరణించిన వారిలో 15.2 శాతం మంది ముడతల స్కోరు రెండు నుంచి మూడు వరకు ఉంది. 6.6 శాతం మంది స్కోరు ఒకటి వచ్చింది. ఇక వీరిలో 2.1 శాతం మందికి ముడతలు లేవు. 


దీన్ని బట్టి ముడతలు లేని వారితో పోలిస్తే అధిక ముడతలు ఉన్నవారిలో మరణాల ప్రమాదం ఎక్కువని తేలింది. లోతైన ముడతలు ఉన్నవారిలో పదిశాతం త్వరగా మరణించే అవకాశం ఉన్నట్టు అధ్యయనం తేల్చింది. 


గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.



Also Read: కొత్త ఏడాదిలో ధనవంతులవ్వాలని ఆశపడుతున్నారా? ఇంట్లో ఈ వస్తువులు ఉండేలా చూసుకోండి...
Also Read: టీ ప్రేమికులందరికీ ఓ ప్రశ్న... రోజూ మీరు తాగే టీ మిమ్మల్ని లావుగా చేస్తోందని తెలుసా?





ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.