అక్కినేని అఖిల్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తరువాత సక్సెస్ కోసం చాలా పరితపించారు. కానీ ఆయన నటించిన సినిమాలన్నీ ఏవరేజ్ గా ఆడాయి. ఎట్టకేలకు తన నాల్గో సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'తో హిట్ అందుకున్నాడు. ఈ సినిమా మంచి వసూళ్లను కూడా రాబట్టింది. ఇంతకాలానికి హిట్ దక్కడంతో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో పడ్డాడు ఈ యంగ్ హీరో. 


తన కొత్త సినిమా 'ఏజెంట్'తో మాస్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. వక్కంతం వంశీ అందించిన కథతో దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇందులో అఖిల్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం అఖిల్ చాలానే కష్టపడుతున్నాడు. యాక్షన్ సీన్స్ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు. తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం జిమ్ లో గంటలు తరబడి వవర్కవుట్ చేస్తున్నాడు. 


దాని ఫలితంగా అఖిల్ ఇప్పుడు బాగా కండలు పెంచి కనిపిస్తున్నాడు. కండలు తిరిగిన దేహంతో ఉన్న అఖిల్ తన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో బాగా వైరల్ అవుతోంది. 'ఏజెంట్' సినిమా కోసం అఖిల్ తన మజిల్స్ ను బాగా పెంచాడని తెలుస్తోంది. అఖిల్ ను ఎప్పుడూ ఈ విధంగా చూసి ఉండరు. 


ఫ్యాన్స్ అయితే ఈ లుక్ చూసి షాకవుతున్నారు. కింగ్ కొడుకు అంటే ఆ మాత్రం ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీలో ఇప్పటివరకు ఏ రేంజ్ లో కండలు పెంచిన హీరోలు ఎవరూ లేరని.. ఆ క్రెడిట్ అఖిల్ కే దక్కుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. వచ్చే ఏడాదిలో విడుదల కానున్న 'ఏజెంట్' సినిమాలో అఖిల్ తన కొత్త లుక్ తో కనిపించనున్నాడు. 






Also Read: పాముతో పాటేసుకుంది.. దానికి తిక్కరేగి కాటేసింది.. ప్రముఖ సింగర్‌కు చేదు అనుభవం


Also Read:తమన్ కి క్రేజీ ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్.. 'రాధేశ్యామ్' బీజియమ్ అదిరిపోవాలంతే..


Also Read: త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ లో నవీన్.. త్వరలోనే టైటిల్ అనౌన్స్మెంట్..


Also Read: ఏపీలో థియేటర్లు క్లోజ్.. నిఖిల్ ఎమోషనల్ పోస్ట్..


Also Read:సల్మాన్ ఖాన్ కి పాముకాటు.. హాస్పిటల్ లో ట్రీట్మెంట్..


Also Read:టాలీవుడ్ లో యూనిటీ లేదు.. వైరల్ అవుతోన్న నాని వ్యాఖ్యలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి