ఏపీలో టికెట్ రేట్ ఇష్యూ వ్యవహారం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం విధించిన రేట్లకు టికెట్లను అమ్ముకోలేక చాలా మంది థియేటర్లను మూసేస్తున్నారు. ఏపీలో దాదాపు అరవై థియేటర్లను మూసేశారని సమాచారం. ఈ విషయంలో హీరో నాని, సిద్ధార్థ్ లాంటి వాళ్లు మాట్లాడుతూనే ఉన్నారు. రీసెంట్ గా నాని.. సినిమా కలెక్షన్స్ కంటే కిరాణా షాపు కలెక్షన్స్ బెటర్ గా ఉంటున్నాయని చెప్పడం హాట్ టాపిక్ అయింది. ఈ విషయంలో ఏపీ మంత్రులు నానిని టార్గెట్ చేస్తూ విమర్శించారు.
తాజాగా ఈ విషయంపై మరో యంగ్ హీరో నిఖిల్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ట్రైన్ లో టైర్ కంపార్ట్మెంట్స్ ఆధారంగా టికెట్లను ఎలా నిర్ణయిస్తున్నారో.. అలానే థియేటర్లలో టికెట్ రేట్లను నిర్ణయించాలని కోరారు. ప్రతి సింగిల్ స్క్రీన్ థియేటర్లో 20 రూపాయల టికెట్ సెక్షన్ కూడా ఉందని.. ఇప్పుడున్న సినిమా థియేటర్లు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
ఫ్లెక్సిబుల్ టికెట్ రేట్ తో బాల్కనీ, ప్రీమియర్ విభాగాన్ని అనుమతించమని అధికారులను కోరారు నిఖిల్. థియేటర్లు తనకు దేవాలయం లాంటివని.. ప్రజలకు ఎప్పుడూ అవి ఆనందాన్ని ఇస్తాయని చెప్పుకొచ్చారు. థియేటర్లు మూతపడడంతో చాలా బాధగా ఉందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సినిమా పరిశ్రమను ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉందని.. ఏపీ ప్రభుత్వం కూడా థియేటర్లకు పూర్వవైభవాన్ని తీసుకొస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
ఈ పోస్ట్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ విషయంలో మిగిలిన హీరోలు కూడా మాట్లాడాలంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక నిఖిల్ సినిమాల విషయానికొస్తే.. అతడు నటించిన '18 పేజెస్' సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే 'కార్తికేయ 2' సినిమా షూటింగ్ దశలో ఉంది.
Also Read:సల్మాన్ ఖాన్ కి పాముకాటు.. హాస్పిటల్ లో ట్రీట్మెంట్..
Also Read:టాలీవుడ్ లో యూనిటీ లేదు.. వైరల్ అవుతోన్న నాని వ్యాఖ్యలు
Also Read:యూవీ క్రియేషన్స్ లో నవీన్ పోలిశెట్టి.. అనుష్కకు జంటగా..
Also Read: 'మా రెండు కుటుంబాల మధ్య 35 ఏళ్ల పోరు..' మెగా,నందమూరి ఫ్యామిలీలపై ఎన్టీఆర్ కామెంట్స్..
Also Read:సల్మాన్ కి 'నాటు' స్టెప్స్ నేర్పించిన ఎన్టీఆర్, చరణ్..
Also Read: సన్నీకి మాధవీలత వార్నింగ్.. అతడు కనిపిస్తే చెంప పగలగొడతా అంటూ ఫైర్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి