'జాతిరత్నాలు' సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నవీన్ పోలిశెట్టి తన తదుపరి సినిమా యూవీ క్రియేషన్స్ లో చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వార్తలు రాగా.. తాజాగా ఈ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడించారు యూవీ నిర్మాతలు. ఈరోజు నవీన్ పోలిశెట్టి పుట్టినరోజు సందర్భంగా అతడికి విషెస్ చెబుతూ.. ఓ పోస్టర్ ను వదిలారు. 'రారా కృష్ణయ్య' ఫేమ్ దర్శకుడు మహేష్ బాబు ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. 


ఇందులో సౌతిండియన్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటిస్తోంది. కొన్నిరోజుల క్రితం ఆమె సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలిపింది. ఇప్పుడు ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదొక రొమాంటిక్ లవ్ స్టోరీ అని సమాచారం. వయసులో దాదాపు ఇరవై ఏళ్లు గ్యాప్ ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ పుట్టడం.. వాళ్లు ఎదుర్కొనే పరిమాణాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.


 యంగ్ హీరో నవీన్ పోలిశెట్టికి కెరీర్ ఆరంభంలోనే అనుష్క లాంటి హీరోయిన్ తో కలిసి నటించే ఛాన్స్ రావడమంటే విశేషమనే చెప్పాలి. పైగా సినిమాలో ఇద్దరి రోల్స్ చాలా కొత్తగా ఉంటాయట. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. 










Also Read: 'మా రెండు కుటుంబాల మధ్య 35 ఏళ్ల పోరు..' మెగా,నందమూరి ఫ్యామిలీలపై ఎన్టీఆర్ కామెంట్స్..


Also Read:సల్మాన్ కి 'నాటు' స్టెప్స్ నేర్పించిన ఎన్టీఆర్, చరణ్..