దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేస్తున్నారు. బాలీవుడ్ లో ఈ సినిమాను జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. ఇటీవలే ముంబైలో గ్రాండ్ ఈవెంట్ ను నిర్వహించారు. దీనికి సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్ లాంటి ప్రముఖులు హాజరయ్యారు. కపిల్ శర్మ కామెడీ షో, బిగ్ బాస్ హిందీ షో ఇలా అన్నింటికీ హాజరవుతూ తమ సినిమాను ప్రమోట్ చేసుకుంటుంది 'ఆర్ఆర్ఆర్' టీమ్. సౌత్ లో కంటే ముంబైలో ఈ సినిమాను జోరుగా ప్రచారం చేస్తున్నారు. అక్కడ భారీ కలెక్షన్స్ ఆశిస్తున్నారు 'ఆర్ఆర్ఆర్' నిర్మాత. 


అయితే ఇప్పుడు కలెక్షన్స్ విషయంలో ఈ సినిమా పెద్ద దెబ్బ పడిందనే చెప్పాలి. కోవిడ్ థర్డ్ వేవ్ కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగా మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ విధించింది. అంతేకాదు.. థియేటర్లలో యాభై శాతం ఆక్యుపెన్సీ నిబంధన పెడుతూ జీవో జారీ చేసింది. ఇది నిజంగానే బాలీవుడ్ పెద్ద దెబ్బ. 


'ఆర్ఆర్ఆర్' సినిమా పాన్ ఇండియా లెవెల్ విడుదలవుతోంది. బాలీవుడ్ నుంచి భారీ వసూళ్లను ఆశిస్తున్న ఈ సమయంలో అక్కడ యాభై శాతం ఆక్యుపెన్సీ విధించడం.. వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పైగా నైట్ కర్ఫ్యూ విధిస్తే.. సెకండ్ షోలను కూడా పోగొట్టుకోవాల్సి ఉంటుంది. మహారాష్ట్రలో గనుక ఈ రూల్స్ మొదలైతే.. మెల్లగా ఇతర రాష్ట్రాలు కూడా ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. 


ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. ఏపీ, తెలంగాణలో కూడా రోజురోజుకి కేసులు పెరుగుతున్నాయి. కాబట్టి జనవరి మొదటివారం నుంచి నిబంధనలు మరింత కఠినతరం చేసే ఛాన్స్ ఉంది. అదే జరిగితే 'ఆర్ఆర్ఆర్' సినిమా కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడడం ఖాయం. అందుకే నిన్నటినుంచి ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. మరి ఈ విషయంలో 'ఆర్ఆర్ఆర్' ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి!


Also Read:స్టార్ కమెడియన్ కి ఒమిక్రాన్‌..? హాస్పిటల్ లో ట్రీట్మెంట్..


Also Read:హీరోయిన్ తో ఆమిర్ ఖాన్ సీక్రెట్ మ్యారేజ్.. అసలు నిజమిదే..


Also Read: పవన్ కల్యాణ్ వెనుక వరుణ్ తేజ్... 'గని' రిలీజ్ డేట్ ఫిక్స్!


Also Read: తొడ కొట్టిన బాలయ్య... తగ్గేదే లే!


Also Read: భీమ్లా నాయక్... పవన్ కల్యాణ్ కోసం త్రివిక్రమ్ స్పెషల్ క్లైమాక్స్!


Also Read: '83' మూవీ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే...?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి