ఒకప్పుడు తెలుగులో మల్టీస్టారర్ సినిమాలు వచ్చేవి కానీ ఆ తరువాత బాగా తగ్గాయి. ఇప్పుడిప్పుడు మళ్లీ ఆ ట్రెండ్ వస్తోంది. స్టార్ డైరెక్టర్లు, హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుండడం విశేషం. మరికొన్ని రోజుల్లో టాలీవుడ్ నుంచి బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా రాబోతుంది. అదే 'ఆర్ఆర్ఆర్'. గత రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫైనల్ గా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్లను ఒకే తెరపై చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని ప్రాంతాలకు తిరుగుతూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. బాలీవుడ్ లో జోరుగా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. కపిల్ శర్మ షో, బిగ్ బాస్ షో ఇలా ఏ ఒక్కటి వదలడం లేదు. వీలైనంత ఎక్కువగా సినిమా జనాలకు రీచ్ అయ్యేలా చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
'ఆర్ఆర్ఆర్' సినిమా తరువాత ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాలు వచ్చే ఛాన్స్ ఉందా..? అనే ప్రశ్నకు సమాధానంగా ఎన్టీఆర్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది ఇప్పుడు చెప్పొచ్చో లేదో తెలియదు కానీ.. మా రెండు కుటుంబాల మధ్య 35 ఏళ్లుగా పోరు నడుస్తోందని.. కానీ మేమిద్దరం(రామ్ చరణ్, ఎన్టీఆర్) మంచి స్నేహితులమని.. మా మధ్య పోరు ఎప్పుడూ పాజిటివ్ గా ఉంటుందని అన్నారు ఎన్టీఆర్.
మన దేశంలో ఎంతోమంది గొప్ప నటీనటులు ఉన్నారని.. 'ఆర్ఆర్ఆర్' తరువాత అందరూ ఒకే తాటిమీదకు వస్తారని.. భారీ మల్టీస్టారర్ సినిమాలు వస్తాయనే నమ్మకం ఉందని చెప్పారు ఎన్టీఆర్. ఇక రాజమౌళి గురించి మాట్లాడుతూ.. ఆయన కేవలం స్నేహితుడు మాత్రమే కాదని.. తన జీవితంలో ఎంతో కీలకమైన వ్యక్తి అని చెప్పారు. తన కెరీర్ లో ఏం జరుగుతుందో కూడా తెలియని సమయంలో.. తన జీవితాన్ని ఇంతలా మార్చిన వ్యక్తి అతడేనని.. మంచి నటుడిగా మారడానికి కూడా ఆయనే కారణమని చెప్పుకొచ్చారు.
Also Read:సల్మాన్ కి 'నాటు' స్టెప్స్ నేర్పించిన ఎన్టీఆర్, చరణ్..
Also Read:అవమానకర రీతిలో డాన్స్.. సన్నీలియోన్ ను ఇండియా నుంచి తరిమేయమంటూ ఫైర్..
Also Read:పవన్ కి సపోర్ట్ చేసి ఉంటే.. పరిస్థితి ఇలా ఉండేదా..?
Also Read:'ఆర్ఆర్ఆర్'కి పెద్ద దెబ్బే.. కలెక్షన్స్ పై ఎఫెక్ట్ తప్పదు..
Also Read:స్టార్ కమెడియన్ కి ఒమిక్రాన్..? హాస్పిటల్ లో ట్రీట్మెంట్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి