Chattisgarh Encounter: గ్రే హౌండ్స్, మావోయిస్టులకు మధ్య కాల్పులు.. ఆరుగురు మావోయిస్టులు మృతి, కొనసాగుతున్న ఆపరేషన్

Naxals Encounter: ఛత్తీస్ గఢ్, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల పరిసర ప్రాంతాల్లో తెలంగాణ గ్రే హౌండ్స్ బలగాలకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది.

Continues below advertisement

Naxals Encounter: నక్సల్స్ ఏరివేత కోసం భద్రతా బలగాలు చేస్తున్న ఆపరేషన్‌ తెలంగాణ ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో కొనసాగుతోంది. ఎన్‌కౌంటర్ లో ఆరుగురు నక్సలైట్లు చనిపోయారు. కిస్తారమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఛత్తీస్ గఢ్, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల పరిసర ప్రాంతాల్లో తెలంగాణ గ్రే హౌండ్స్ బలగాలకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. 

Continues below advertisement

ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు నక్సలైట్లు చనిపోగా, మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మావోయిస్టుల ఆపరేషన్ అనంతరం మృతదేహాలను , ఆయుధాలు గ్రే హౌండ్స్ బలగాలు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ భద్రాద్రి కొత్తగూడం ఎస్పీ సునీల్ దత్ నేతృత్వంలో నక్సల్స్ ఏరివేత ఆపరేషన్ నిర్వహించారు. మావోయిస్టుల కదలికలతో కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: Actress Suicide: ఆ కేసులో ఇరికిస్తారనే భయంతో యువనటి ఆత్మహత్య.. అధికారులు డబ్బులు డిమాండ్ చేయడంతో దారుణం.. చివర్లో ట్విస్ట్

చనిపోయిన వారిలో నలుగురు మహిళా నక్సలైట్లు ఉన్నారని తెలుస్తోంది. చర్ల ఏరియా కమాండర్ మధు సైతం ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో హతమైనట్లు సమాచారం. మావోయిస్టుల కదలకలు ఉన్నాయనే సమాచారంతో తెలంగాణ గ్రే హౌండ్స్ బలగాలు, పక్కా ప్లానింగ్‌తో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టింది. ఉదయం 6 నుంచి ఏడున్నర గంటల ప్రాంతంలో కాల్పుల మోత మోగింది. కుర్ణవల్ల, పెసలపాడు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్‌లో ఆరుగురు నక్సలైట్లు చనిపోయారు. 

Also Read: Crime News: ప్రేమజంట ఆత్మహత్యాయత్నం... వారికి ఇదివరకే పెళ్లయింది, కానీ సీక్రెట్‌గా కలుసుకుంటూ చివరికి ఇలా!

Also Read: Year Ender 2021: మోదీ షాకిచ్చిన 5 ప్రకటనలు..! సారీతో సంచలనం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement