నెల్లూరు జిల్లా స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో పోలీసులు గంజాయి స్మగ్లింగ్ ముఠాను పట్టుకున్నారు. వీరిలో మహిళలే ప్రధాన పాత్రధారులు కావడం విశేషం. మహిళలను అడ్డు పెట్టుకుని గంజాయి రవాణా సాగిస్తున్నట్టు గుర్తించారు. తిరుపతి వెళ్తున్న రెండు బస్సుల్లో గంజాయి ప్యాకెట్లు తరలిస్తుండగా చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. 28 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని ఆరుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఐదుగురు మహిళలు ఉండటం విశేషం. 


ఆర్టీసీ బస్సుల్లో గంజాయి.. 
ప్రైవేట్ వాహనాల్లో గంజాయి తరలిస్తే.. పోలీసులకు సమాచారం అందుతోందని, తనిఖీల్లో భాగంగా వాటిని స్వాధీనం చేసుకుంటున్నారనే అనుమానంతో ఇటీవల గంజాయి బ్యాచ్ ఆర్టీసీ బస్సుల్ని ఎంపిక చేసుకుంది. ఆర్టీసీ బస్సుల్లో సాధారణ ప్రయాణికుల్లాగా వీరు ఎక్కుతారు. తలా ఒక ప్యాకెట్ సంచిలో వేసుకుంటారు. ఎవరికీ ఎక్కడా అనుమానం రాకుండా ప్రయాణికుల్లాగే వీరు బోర్డర్ దాటేస్తుంటారు. నెల్లూరు నుంచి తిరుపతికి బస్సులో ప్యాకెట్ తీసుకెళ్తే.. అక్కడ్నుంచి సులభంగా బోర్డర్ దాటించేయచ్చనేది వీరి ప్లాన్. కానీ ఇటీవల నెల్లూరు జిల్లా సెబ్ అధికారులు ఆర్టీసీ బస్సులపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. చెక్ పోస్ట్ ల వద్ద బస్సుల్ని ఆపి తనిఖీలు చేపట్టారు. తాజాగా నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం బూదనం టోల్ ప్లాజా వద్ద  సెబ్ అధికారులు దాడులు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం జిల్లా పాడేరు నుంచి తిరుపతికి రెండు ఆర్టీసీ బస్సుల్లో అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించారు. 


Also Read: ఆనందయ్య ఒమిక్రాన్ మందుకు ఎదురుదెబ్బలు, ప్రభుత్వం నుంచే.. పంపిణీ సాగేనా?


న్యూ ఇయర్ పార్టీలకోసమేనా..?
కొత్త సంవత్సర వేడుకల్లో యువతను టార్గెట్ చేసేందుకు ఈ గంజాయిన తరలిస్తున్నట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. 28కేజీల గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో 3 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. గంజాయి రవాణాకోసం అక్రమార్కులు ఎన్ని కొత్త ఎత్తుగడలు వేసినా వాటిని విఫలం చేస్తున్నట్టు తెలిపారు. న్యూ ఇయర్ పార్టీలకోసం ఈ వారంలో ఎక్కువగా గంజాయిని తరలిస్తున్నట్టు సమాచారం వచ్చిందని, అందుకే తనిఖీలు తీవ్రతరం చేశామంటున్నారు పోలీసులు. 


రాష్ట్రవ్యాప్తంగా గంజాయి సాగు, అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ముఖ్యంగా విశాఖపట్నం ఏజెన్సీలో గంజాయి సాగుపై ప్రధానంగా దృష్టిపెట్టారు అధికారులు. వేలాది ఎకరాల్లో పంటను ధ్వంసం చేస్తున్నారు. గంజాయి సాగు చేస్తున్న వారికోసం ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపెడుతున్నారు. ఏపీలో గంజాయి సాగు, రవాణాపై ఆమధ్య ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. దీంతో ప్రభుత్వం పోలీసులకు కఠిన ఆదేశాలిచ్చింది. ఇటు సెబ్ అధికారులు కూడా గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపారు. ముఖ్యంగా రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో నిఘా పెంచారు. 


Also Read: Kidambi Srikant : కిడాంబి శ్రీకాంత్‌కు రూ. 7 లక్షలు.. 5 ఎకరాల భూమి.. సీఎం జగన్ నజరానా !


Also Read: మందు బాబులకు గుడ్ న్యూస్.. మద్యం విక్రయ వేళలు పొడిగింపు.. న్యూ ఇయర్ కు తగ్గేదేలే అంటారేమో..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి