భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు ఏపీ ప్రభుత్వం తరపున రూ. 7 లక్షల నగదు బహుమతి, తిరుపతిలో అకాడమీ ఏర్పాటుకు ఐదెకరాల భూమి కేటాయించారు. స్పెయిన్‌లో జరిగిన 2021 బీడబ్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్ పోటీల్లో శ్రీకాంత్ ఫైనల్ చేరుకున్నారు. ఫైనల్‌లో ఓడిపోవడంతో రజత పతకం లభించింది. ఇంత వరకూ ఏ షట్లర్ కూడా ఫైనల్ చేరుకోలేదు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన తొలి భారత పురుష షట్లర్ గా రికార్డు సృష్టించారు. దీంతో ఏపీ ప్రభుత్వం నజరానా ప్రకటించాలని నిర్ణయించుకుంది. కిడాంబి శ్రీకాంత్ కుటుంబసభ్యులతో కలిసి సీఎం జగన్‌తో సమావేశం అయ్యారు. ఏపీ సీఎం వైఎస్ జగన్.. కిడాంబి శ్రీకాంత్‌ను ఘనంగా సత్కరించారు.
Also Read: చెలరేగిన భారత బౌలర్లు... సౌతాఫ్రికా 199 పరుగులకే ఆలౌట్... 146 పరుగుల ఆధిక్యంలో భారత్
ప్రస్తుతం శ్రీకాంత్ ఏపీలో డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 2017లో జరిగిన ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో శ్రీకాంత్ టైటిల్ కైవసం చేసుకున్నారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాంత్‌కు గ్రూప్-1 ఉద్యోగం ప్రకటించారు. ఈ మేరకు క్రీడల కోటా కింద డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ 2018లో అప్పటి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. తర్వాత శ్రీకాంత్ శిక్షణ కూడా పూర్తి చేసుకున్నారు. 2020 ఆంధ్రప్రదేశ్ పర్యటక శాఖ ప్రాధికార సంస్థలో డిప్యూటీ కలెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చింది. అయితే టోర్నమెంట్లలో పాల్గొనే వెసులుబాటు కల్పించింది.
Also Read: మా తెలుగు ఆటగాడు చేసిన తప్పేంటి? టీమ్‌ఇండియాపై విమర్శల వర్షం!!
తిరుపతిలో ఆకాడమీ పెట్టాలని శ్రీకాంత్ ఆసక్తి చూపించడంతో ప్రభుత్వం అక్కడ ఐదు ఎకరాలను కేటాయించాలని నిర్ణయించింది. ఇప్పటికే పీవీ సింధుకు విశాఖ పట్నంలో రెండు ఎకరాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఏపీలో ఇద్దరు దిగ్గజ ప్లేయర్లు.. రెండు బ్యాడ్మింటన్ ఆకాడమీల్ని పెట్టబోతున్నారు. అయితే ఇప్పటికీ సింధు, శ్రీకాంత్ చురుగ్గా టోర్నమెంట్లలో పాల్గొంటున్నారు. అందుకే అకాడెమీలు నెలకొల్పే సరికి బాగా సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు.
Also Read: అమ్మబాబోయ్.. అన్ని డకౌట్లా.. అత్యంత చెత్త రికార్డు సాధించిన ఇంగ్లండ్!