దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 781కి పెరిగింది. దిల్లీలో ఇప్పటివరకు అత్యధికంగా 238 ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా మహారాష్ట్రలో 167 కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశంలో 21 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వ్యాప్తి చెందింది. 


రాష్ట్రాల వారీగా..




ఒమిక్రాన్ ఆంక్షలు..


ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతోన్న కారణంగా పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఒమిక్రాన్ వ్యాప్తి రేటు వరుసగా రెండు రోజులు క్రిటికల్ మార్క్‌ను దాటడంతో తాజాగా దిల్లీ సర్కార్ ఆంక్షలు విధించింది.


మరోవైపు ముంబయి నైట్ కర్ఫ్యూ విధించింది. పండుగ సీజన్ కావడంతో పలు ఆంక్షలను కూడా మహారాష్ట్ర సర్కార్ విధించింది.


రాజస్థాన్‌లో..


రాజస్థాన్‌లో కొత్తగా 23 ఒమిక్రాన్ కేసులు నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 68కి చేరింది. ఈ మేరకు రాజస్థాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. అజ్మేర్‌లో 10, జైపూర్ (9), భిల్వారా (2)లో రెండు కేసులు నమోదయ్యాయి.


కొవిడ్ వ్యాప్తి..


దిల్లీలో కరోనా కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. దేశ రాజధానిలో కొత్తగా 496 కరోనా కేసులు నమోదుకాగా ముంబయిలో 1,377 కేసులు వెలుగుచూశాయి. 


దేశంలో కొత్తగా 9,195 కరోనా కేసులు నమోదుకాగా యాక్టివ్ కేసుల సంఖ్య 77,002కు చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.22గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యల్పం.







రికవరీ రేటు 98.40గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యధికం. మొత్తం రికవరీల సంఖ్య 3,42,51,292కు పెరిగింది.


వ్యాక్సినేషన్..







దేశంలో ఇప్పటివరకు 143.15 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం పేర్కొంది. 67.52 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది.


Also Read: Mother Teresa charity: మదర్ థెరిసా మిషనరీస్ అకౌంట్స్ ఫ్రీజ్ పై వివాదం... నిధులు వినియోగించవద్దని మాత్రమే చెప్పామని కేంద్రం స్పష్టం


Also Read: Health Insurance: పాలసీ జారీ చేశాక మెడికల్ క్లెయిమ్‌ను తిరస్కరించడం చట్టవిరుద్ధం: సుప్రీంకోర్టు కీలక తీర్పు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి