హైదరాబాద్‌లో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునే ముందు చాలా విషయాలను మైండ్‌లో ఉంచుకోవాల్సి ఉంటుంది. రూల్స్ బ్రేక్ చేయడమే కొత్త ఏడాది రిజల్యూషన్ అని బ్లైండ్‌గా మైండ్‌లో ఎక్కించేసుకుని దూసుకెళ్లిపోతే.. ఏడాదంతా మరో నిర్ణయం తీసుకోడానికి కానీ.. అమలు చేయడానికి కానీ అవకాశం ఉండదు. ఎందుకంటే అంత కఠినమైన నిబంధనలను పోలీసులు పెట్టారు. హైదరాబాద్ కొత్త కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్..  న్యూ ఇయర్ సందర్భంగా పలు ఆంక్షలు పెట్టారు. అయితే అవన్నీ ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుమంగానే ఉన్నాయి. 


Also Read: న్యూఇయర్ వేడుకలపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్.. రేపు విచారణ, ఆదేశాలపై ఉత్కంఠ!


న్యూ ఇయర్‌పార్టీల్లో డీజేలకు అనుమతి లేదని కమిషనర్ స్పష్టంచేశారు. . పబ్‌లు, రెస్టారెంట్లకు పక్కన ఉన్న స్థానికులను ఇబ్బందులకు గురి చేయొద్దని..స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే కొవిడ్ రూల్స్‌ను అతిక్రమిస్తే కేసులు నమోదు చేయడం ఖాయమన్నారు.  ఈవెంట్లకు పరిమితికి మించి పాసులను అమ్మొద్దని..పార్టీల్లో డ్రగ్స్ పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే ఈవెంట్లలో పాటలు పేడే సింగర్స్ జనాలలోకి వెళ్లవద్దన్నారు.  


Also Read: బీజేపీ అధికారంలోకి వస్తే.. 70 రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తాం.. అన్ని కుదిరితే 50కే..


రెండూ డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారికే మాత్రమే ఈవెంట్లకు అనుమతి ఇవ్వాలని.. రాత్రి 11 గంటల నుంచి ఉ.5 వరకు ఫ్లైఓవర్లు మూసివేస్తామని ప్రకటించారు. తాగి రోడ్లపై హంగామ చేస్తే కఠిన చర్యలు ఖాయమని.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే కేసులు పెడతామని స్పష్టం చేశారు.31న రాత్రి ఆకస్మికంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లు నిర్వహిస్తామని ప్రకటించారు.  మాస్క్ లేకుండా కనిపిస్తే జరిమానాలు కట్టడానికి సిద్ధంగా ఉండాలన్నారు. 


Also Read: KTR: కొంప ముంచుతున్న సోము వీర్రాజు వ్యాఖ్యలు.. దేశమంతా వైరల్, కేటీఆర్ దిమ్మతిరిగే కౌంటర్


ఇలాంటి రూల్స్ అన్నీ ఎప్పుడూ పెట్టేవేగా అని ఎవరైనా లైట్ తీసుకుంటే.. ఈ సారి వారికి చుక్కలు చూపించడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. అసలే ఒమిక్రాన్ టెన్షన్ పెరుగుతున్నందున... ఎక్కువ మంది ఇళ్లలోనే వేడుకలు నిర్వహించుకునేలా అధికారయంత్రాగం ప్రోత్సాహిస్తోంది. ఈవెంట్లపైనా పోలీసులు నిఘా పెట్టనున్నారు 



Also Read: బ్రాహ్మణులే అర్చకత్వానికి అర్హులా..? తిరుపతిలో సుబ్రహ్మణ్య స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి