'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్. సంక్రాంతి బరి నుంచి సినిమా తప్పుకొంది. జనవరి 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాను విడుదల చేయలేమని చెబుతూ 'ఆర్ఆర్ఆర్' యూనిట్ మరోసారి ప్రేక్షకులకు 'సారీ' చెప్పింది.
దేశంలో మళ్లీ కరోనా, ఓమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. దాంతో సినిమాను విడుదల చేయడం కంటే వాయిదా వేయడం మంచిదని చిత్ర బృందం నిర్ణయం తీసుకుంది. 'ఆర్ఆర్ఆర్' సినిమాను వాయిదా వేసినట్టు నేడు (జనవరి 1న) రాజమౌళి చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. "మేం అవిశ్రాంతంగా ప్రయత్నించినా... తీవ్రంగా కృషి చేసినప్పటికీ... కొన్ని పరిస్థితులు మా కంట్రోల్‌లో లేవు. మాకు మరో అవకాశం లేదు. అందుకని, మీ ఎగ్జైట్‌మెంట్‌ను మరికొన్ని రోజులు ఇలాగే ఉంచమని అడుగుతున్నాం. సరైన సమయంలో... భారతీయ సినిమాకు పూర్వ వైభవం తీసుకు వస్తామని ప్రామిస్ చేస్తున్నాం" అని 'ఆర్ఆర్ఆర్' మూవీ యూనిట్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.





కొమురం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ సినిమాకు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించారు. డీవీవీ దానయ్య నిర్మించారు. ఇందులో ఎన్టీఆర్ సరసన విదేశీ భామ ఒలీవియా మోరిస్, రామ్ చరణ్‌కు జోడీగా ఆలియా భట్, ప్రధాన పాత్రల్లో అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ నటించారు.
Also Read: ఒక్క పోస్ట‌ర్‌, ఒక్క డేట్‌తో రూమ‌ర్స్‌కు చెక్ పెట్టిన 'రాధే శ్యామ్' టీమ్‌!
'ఆర్ఆర్ఆర్'తో పాటు 'రాధే శ్యామ్' కూడా వాయిదా పడినట్టు వార్తలు వచ్చాయి. అయితే... ప్రభాస్ సినిమా బృందం ఆ వార్తలను ఖండించింది. తమ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని వెల్లడించింది.
Also Read: సంక్రాంతికి 'భీమ్లా నాయక్'... పవర్ స్టార్ ముందుకు వస్తున్నారా?
Also Read: దేశానికి సర్పంచ్ ఏంట్రా? సోగాళ్ళ హంగామా... యాక్షన్ అదిరిందిగా!
Also Read: రెండు టాలీవుడ్ టాప్ ప్రోడ‌క్ష‌న్స్‌లో తమిళ హీరోతో 'జాతి రత్నాలు' దర్శకుడి సినిమా
Also Read: ఆందోళనలో 'ఆర్ఆర్ఆర్' ఫ్యాన్స్‌... సినిమా మళ్లీ వాయిదా పడిందా!?
Also Read:
'సేనాపతి' రివ్యూ: రాజేంద్ర ప్రసాద్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా?
Also Read: షన్ముఖ్‌కు షాకిచ్చిన దీప్తి.. బ్రేకప్ చెప్పేస్తూ ఇన్‌స్టా పోస్ట్!
Also Read: 'అర్జున ఫల్గుణ' రివ్యూ: అర్జునుడు బలయ్యాడా? బతికాడా?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి