Shanmukh Deepthi Breakup: దీప్తితో బ్రేకప్‌పై స్పందించిన షన్ముఖ్.. ‘చివరిగా నేను కోరుకొనేది ఇదే దీపు’

దీప్తి సునయనతో బ్రేకప్ గురించి షన్ముఖ్ జస్వంత్ స్పందించాడు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో ఈ విషయాన్ని వెల్లడించాడు.

Continues below advertisement

‘బిగ్ బాస్’ సీజన్-5 రన్నరప్, యూట్యూబర్ షన్ముఖ్ జస్వంత్‌కు అతడి గర్ల్‌ఫ్రెండ్ దీప్తి సునయన ఊహించని షాకిచ్చింది. ఇకపై ఎవరి దారి వారిదేనంటూ.. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె బ్రేకప్ ప్రకటించింది. ఐదేళ్ల బంధానికి ఇక వీడ్కోలంటూ ఆమె భావోద్వేగంతో చేసిన ఆ పోస్ట్‌పై శనివారం షన్ముఖ్ జస్వంత్ కూడా స్పందించాడు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో.. బ్రేకప్ విషయాన్ని ధృవీకరించాడు. 

Continues below advertisement

‘బిగ్ బాస్’ సీజన్-5లో ఫేవరెట్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన షన్ముఖ్.. తన ఆట కంటే సిరితో స్నేహం మీదే ఎక్కువ దృష్టిపెట్టాడనే విమర్శలు వచ్చాయి. సిరి కూడా షన్నుకు పదే పదే హగ్‌లిస్తూ చనువుగా ఉండేది. అది ఫ్రెండ్‌షిప్ హగ్ అని బయటకు సర్దిచెప్పినా.. ఇద్దరి మధ్య సమ్‌థింగ్ ఏదో జరుగుతుందనే ఫీలింగ్ మాత్రం ప్రేక్షకుల్లో ఉంది. వారి స్నేహంపై ఇన్ని రోజులు మౌనంగా ఉన్న దీప్తి.. శుక్రవారం రాత్రి ఒక్కసారే బాంబ్ పేల్చింది. తన బ్రేకప్ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 

‘‘ఎంతో ఆలోచించి, మాట్లాడుకున్న తర్వాత.. షన్ముఖ్, నేను పరస్పర అంగీకారంతో విడిపోయి ఇక వ్యక్తిగతంగా జీవించాలని, ఎవరి దారిలో వాళ్లం వెళ్దామని నిర్ణయించుకున్నాం. ఈ ఐదేళ్లలో మేం ఎంతో సంతోషంగా, అప్యాయంగా ఉన్నాం. కానీ.. మాలోని రాక్షసులతో పోరాడటం కూడా కష్టమే. మీరందరూ కోరుకున్నట్లే మేం ఈ నిర్ణయం తీసుకున్నాం. కానీ ఇది చాలా కాలంగా కొనసాగుతోంది. ఇది సోషల్ మీడియాలో కనిపించినంత తేలికైనది కాదు. మేము కలిసి ఉండటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాం. జీవితంలో మనకు ఏది అవసరమో దాన్ని విస్మరిస్తూనే ఉన్నాం. మా మార్గాలు కూడా భిన్నమైనవి. ఒకే చోట చిక్కుకుని ఉండకుండా ముందుకు సాగాలని మేము గ్రహించాం’’ అని దీప్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

Also Read: షన్ముఖ్‌కు షాకిచ్చిన దీప్తి.. బ్రేకప్ చెప్పేస్తూ ఇన్‌స్టా పోస్ట్!

దీనిపై షన్ముఖ్ శనివారం స్పందించాడు. ‘‘ఆమెకు నిర్ణయం తీసుకొనేందుకు హక్కుంది. ఇప్పటివరకు ఆమె ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. చివరిగా నేను.. ఆమె సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నా. మా దారులు వేరైనా.. ఒకరి కోసం ఒకరం ఆసరాగా ఉంటాం. ఈ ఐదేళ్లలో గొప్ప వ్యక్తిగా ఎదిగేందుకు సహకరించనందుకు ధన్యవాదాలు. నువ్వు సంతోషంగా ఉండాలి. టేక్ కేర్ అండ్ ఆల్ ది బెస్ట్ దీపు’’ అని పేర్కొన్నాడు. అయితే, దీపు-షన్ను అభిమానులు మాత్రం ఈ పాపం సిరిదే అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరి వీరి బ్రేకప్‌పై సిరి ఎలా స్పందిస్తుందో చూడాలి. 

Also Read: రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..
Also Read: అజిత్ అలా చేయడం చాలా ఇబ్బందిగా అనిపించింది.. రాజమౌళి వ్యాఖ్యలు..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.

Continues below advertisement
Sponsored Links by Taboola