హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్! కొత్త ఏడాదికి ఒక్కొక్కరూ ఒక్కోలా వెల్కమ్ చెప్పారు. ఈ స్టార్ మాత్రం దుబాయ్‌లో వెల్కమ్ చెప్పారు. వాళ్లు ఎవరో చూడండి. 

మహేష్ అండ్ ఫ్యామిలీ!

మ‌హేష్ బాబు అండ్ ఫ్యామిలీ కొన్ని రోజులుగా దుబాయ్‌లో ఉంటోంది. సూప‌ర్‌ స్టార్ మోకాలికి స్పెయిన్‌లో స‌ర్జ‌రీ జరిగిన తర్వాత నుంచి దుబాయ్‌లో ఉన్నారు. న్యూ ఇయ‌ర్‌కు కూడా అక్కడే వెల్కమ్ చెప్పారు. దర్శకుడు వంశీ పైడిపల్లి ఫ్యామిలీ సైతం అక్కడ ఉన్న సంగతి తెలిసిందే.


 
లవ్ బర్డ్స్ నయన్ అండ్ విఘ్నేష్!

ప్రేమ పక్షులు నయనతార, విఘ్నేష్ శివన్ సైతం కొత్త ఏడాది సంబరాలు చేసుకోవడానికి దుబాయ్ వెళ్లారు. మిడ్ నైట్ పన్నెండు గంటలకు బుర్జ్ ఖలీఫా టవర్స్ ముందు సాధారణ ప్రజల తరహాలో షికారు చేశారు. ఒకరిని మరొకరు హాగ్ చేసుకుని కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పారు.


రాయ్ లక్ష్మి కూడా అక్కడే!

ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్, హాట్ హీరోయిన్ రాయ్ లక్ష్మి సైతం కొత్త ఏడాదికి దుబాయ్‌లో స్వాగ‌తం చెప్పారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఆమె స్పెష‌ల్‌గా డ్ర‌స్ అప్ అయ్యారు.


భర్తతో కలిసి వెళ్లిన 'దిల్' రాజు కుమార్తె!
ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు కుమార్తె హన్షితా రెడ్డి, ఆమె భర్త అర్చిత్ రెడ్డి కూడా న్యూ ఇయర్ దుబాయ్‌లో నూ ఇయ‌ర్‌కు వెల్క‌మ్ చెప్పారు.



మెహరీన్... ఫుడ్ అండ్ పార్టీతో

హీరోయిన్ మెహరీన్ కౌర్ కూడా దుబాయ్‌లో ఫ్రెండ్స్‌తో క‌లిసి పార్టీ చేసుకున్నారు. అక్కడ ఫుడ్, పార్టీస్ ఫొటోలను ఆమె షేర్ చేశారు.


   

అమలా పాల్ ఆల్సో!

హీరోయిన్ అమలా పాల్ సైతం ఇప్పుడు దుబాయ్‌లో ఉన్నారు. అయితే... ఆమె సోషల్ మీడియాలో దుబాయ్‌లో దిగిన ఫొటోలు షేర్ చేయ‌లేదు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల్లో.... అక్క‌డ తీసుకున్న వీడియోలు షేర్ చేశారు.
Also Read: 'ఆర్ఆర్ఆర్' వాయిదా... మరో'సారీ'... సరైన సమయంలో వస్తామన్న రాజమౌళి టీమ్
Also Read: ఒక్క పోస్ట‌ర్‌, ఒక్క డేట్‌తో రూమ‌ర్స్‌కు చెక్ పెట్టిన 'రాధే శ్యామ్' టీమ్‌!
Also Read: సంక్రాంతికి 'భీమ్లా నాయక్'... పవర్ స్టార్ ముందుకు వస్తున్నారా?
Also Read: రెండు టాలీవుడ్ టాప్ ప్రోడ‌క్ష‌న్స్‌లో తమిళ హీరోతో 'జాతి రత్నాలు' దర్శకుడి సినిమా
Also Read:
'సేనాపతి' రివ్యూ: రాజేంద్ర ప్రసాద్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా?
Also Read:
'అర్జున ఫల్గుణ' రివ్యూ: అర్జునుడు బలయ్యాడా? బతికాడా?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి