DJ Tillu Enters Sankranthi Race: సంక్రాంతి రేసులో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సినిమా 'డీజే టిల్లు'.

యువ హీరో సిద్ధూ జొన్నలగడ్డతో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించిన 'డీజే టిల్లు' సంక్రాంతి రేసులో ఎంటర్ అయ్యింది. ఈ రోజు సినిమా విడుదల తేదీ ప్రకటించారు.

Continues below advertisement

యువ హీరో సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), నేహా శెట్టి జంటగా సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించిన సినిమా 'డీజే టిల్లు' (DJ Tillu). ఇది సంక్రాంతి రేసులో ఎంటర్ అయ్యింది. జనవరి 14న సినిమాను విడుదల (DJ Tillu Release Date) చేస్తున్నట్టు తాజాగా వెల్లడించారు. విమల్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. విమల్ కృష్ణతో కలిసి సిద్ధూ జొన్నలగడ్డ కథ రాశారు. ఆయనే మాటలు కూడా అందించారు. ఇటీవల విడుదల అయిన 'డిజె టిల్లు' టీజర్ చూస్తే... యువతరాన్ని ఆకట్టుకునేలా ఉంది. న్యూ ఏజ్ రొమాంటిక్ సినిమా ఇది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో అవి ఫినిష్ చేసి, సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేయడానికి యూనిట్ రెడీ అవుతోంది. ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రా శ్రీనివాస్ నటించిన ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీత దర్శకుడు.

Continues below advertisement

నిజానికి, ఈ ఏడాది సంక్రాంతికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా హీరోలుగా నిర్మించిన 'భీమ్లా నాయక్' సినిమాను విడుదల చేయాలని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ భావించింది. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకున్నారు. అయితే... 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్' దర్శక నిర్మాతలు రిక్వెస్ట్ చేయడంతో పవన్ సినిమాను వాయిదా వేశారు. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' వాయిదా పడటంతో 'డీజే టిల్లు'ను సంక్రాంతికి తీసుకొస్తున్నారు. 'రాధే శ్యామ్', 'డీజే టిల్లు' ఒకే రోజున... జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.  
Also Read: ఆవకాయ్ సీజ‌న్‌లో 'అంటే సుందరానికి'... చ‌క్కిలిగింత‌ల్ పెడుతుంద‌ని!
Also Read: మహేష్ బాబు TO నయనతార, రాయ్ లక్ష్మి... దుబాయ్‌లో నూ ఇయ‌ర్‌కు వెల్క‌మ్ చెప్పిన స్టార్స్!
Also Read: 'ఆర్ఆర్ఆర్' వాయిదా... మరో'సారీ'... సరైన సమయంలో వస్తామన్న రాజమౌళి టీమ్
Also Read: ఒక్క పోస్ట‌ర్‌, ఒక్క డేట్‌తో రూమ‌ర్స్‌కు చెక్ పెట్టిన 'రాధే శ్యామ్' టీమ్‌!
Also Read: సంక్రాంతికి 'భీమ్లా నాయక్'... పవర్ స్టార్ ముందుకు వస్తున్నారా?
Also Read: రెండు టాలీవుడ్ టాప్ ప్రోడ‌క్ష‌న్స్‌లో తమిళ హీరోతో 'జాతి రత్నాలు' దర్శకుడి సినిమా
Also Read: 
'సేనాపతి' రివ్యూ: రాజేంద్ర ప్రసాద్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement
Sponsored Links by Taboola