యూట్యూబ్ స్టార్స్ షణ్ముఖ్, దీప్తి సునైనాలు తమ రిలేషన్షిప్ కి బ్రేకప్ చెప్పేశారు. ఈ విషయాన్ని దీప్తి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. దాదాపు ఐదేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేశారు. ఇద్దరి మధ్య మంచి ర్యాపో ఉంది. అలాంటిది సడెన్ గా బ్రేకప్ చెప్పుకోవడం హాట్ టాపిక్ అయింది. దీనికి కారణాలు ఏంటో వారు చెప్పనప్పటికీ.. బిగ్ బాస్ సీజన్ 5 మెయిన్ రీజన్ అని తెలుస్తోంది.
ఈ షోలోకి కంటెస్టెంట్ గా వెళ్లిన షణ్ముఖ్.. తోటి కంటెస్టెంట్ సిరితో బాగా క్లోజ్ అయ్యాడు. వీరిద్దరూ ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయిపోయారు.
హగ్గులు, ముద్దులతో రెచ్చిపోయారు. ఒకరి మీద ఒకరు అలుగుతూ.. మళ్లీ హగ్గులు ఇచ్చుకుంటూ కనిపించేవారు. వీరి బిహేవియర్ ఆడియన్స్ ను కాస్త విసిగించిందనే చెప్పాలి. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ కూడా ఇంటర్వ్యూలలో సిరి-షణ్ముఖ్ లు జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే కాదని చెప్పేవారు.
ఇద్దరూ ఒకరినొకరు విడిచి ఉండలేని స్టేజ్ లో ఉన్నారంటూ చాలా మంది హౌస్ మేట్స్ చెప్పారు. కానీ షణ్ముఖ్, సిరి మాత్రం తామిద్దరం స్నేహితులం మాత్రమేనని పలుసార్లు వెల్లడించారు. సిరితో షణ్ముఖ్ క్లోజ్ అవ్వడం దీప్తికి కూడా నచ్చలేదని.. అందుకే ఆమె బ్రేకప్ చెప్పి ఉంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా.. దీప్తి.. షణ్ముఖ్ తో తన రిలేషన్ ను బ్రేక్ చేసుకుంది.
అయితే ఇప్పుడు సిరి రిలేషన్ కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లకముందే సిరికి శ్రీహాన్ అనే ఆర్టిస్ట్ తో ఎంగేజ్మెంట్ జరిగింది. అతడు బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చినప్పుడు 'వదిలేస్తున్నావా.. సిరి..?' అని కూడా అడిగాడు. ఆ సమయంలో ఆమె సారీ చెప్పి శ్రీహాన్ ను కూల్ చేసింది. అయితే ఇప్పుడు శ్రీహాన్ కూడా దీప్తి స్ట్రాటజీ ఫాలో అవ్వబోతున్నాడని టాక్. సోషల్ మీడియా వేదికగా సిరికి గుడ్ బై చెప్పబోతున్నాడంటూ కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరేం జరుగుతుందో చూడాలి!
Also Read: ఆ అమ్మాయి మెడపై ముద్దు పెట్టిన సుధీర్ బాబు
Also Read: సంక్రాంతి రేసులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమా 'డీజే టిల్లు'.
Also Read: ఆవకాయ్ సీజన్‌లో 'అంటే సుందరానికి'... చక్కిలిగింతల్ పెడుతుందని!
Also Read: మహేష్ బాబు TO నయనతార, రాయ్ లక్ష్మి... దుబాయ్‌లో నూ ఇయర్‌కు వెల్కమ్ చెప్పిన స్టార్స్!
Also Read: 'ఆర్ఆర్ఆర్' వాయిదా... మరో'సారీ'... సరైన సమయంలో వస్తామన్న రాజమౌళి టీమ్
Also Read: ఒక్క పోస్టర్, ఒక్క డేట్‌తో రూమర్స్‌కు చెక్ పెట్టిన 'రాధే శ్యామ్' టీమ్!
Also Read: సంక్రాంతికి 'భీమ్లా నాయక్'... పవర్ స్టార్ ముందుకు వస్తున్నారా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి