పాన్ ఇండియా రిలీజ్ కావడంతో దర్శకధీరుడు రాజమౌళి తన ఇద్దరు హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో కలిసి 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రమోషన్స్ ను ఓ రేంజ్ లో చేశారు. ముంబై, చెన్నై, కేరళ, బెంగుళూరు అంటూ గ్యాప్ లేకుండా తిరిగారు. ప్రీరిలీజ్ ఈవెంట్స్, ప్రెస్ మీట్స్ తో బిజీగా గడిపారు. కానీ ఊహించని విధంగా జనవరి 7న విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు వాయిదా పడింది. 


దానికి కారణాలు చాలానే ఉన్నాయి. ముంబై, ఢిల్లీలలో కర్ఫ్యూలు విధించడం.. తమిళనాడు రాష్ట్రంలో థియేటర్ అక్యుపెన్సీ యాభై శాతం చేయడం, ఏపీలో టికెట్ రేట్ ఇష్యూ.. ఇవన్నీ కలిపి 'ఆర్ఆర్ఆర్' వాయిదా పడేలా చేశాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం నిర్మాత ఎంత ఖర్చు పెట్టారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. 


ఓవరాల్ గా చూసుకుంటే రాజమౌళి అండ్ ఇద్దరు హీరోలు కలిసి 50కి పైగా ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. అందులో కొన్ని పెయిడ్ ఇంటర్వ్యూలు ఉండగా.. మరికొన్ని అన్ పెయిడ్ ఉన్నాయి. ఇండియా వైడ్ గా తిరగడానికి చార్టెడ్ ఫ్లైట్ ను వాడారు. ఇక హోటల్ ఖర్చు ఎలానూ ఉంటుంది. ఇలా అన్ని కలుపుకొని ప్రమోషన్స్ కోసం రూ.12 నుంచి 15 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇంత ఖర్చు చేసినా.. ఇప్పుడు రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది. 


కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించేవరకు ఈ బజ్ ఎంతవరకు ఉంటుందో చెప్పలేం. కాబట్టి మళ్లీ ఫ్రెష్ గా ప్రమోషన్స్ చేసుకోవాలి. మొత్తానికి ఈ సినిమాతో నిర్మాత దానయ్య ఆర్థికంగా బాగా ఎఫెక్ట్ అవుతున్నట్లు ఉన్నారు. కానీ ఒక్కసారి సినిమా రిలీజ్ అయితే ఇండస్ట్రీ రికార్డులు బద్దలవ్వడం ఖాయమని నమ్ముతున్నారాయన. మరేం జరుగుతుందో చూడాలి!


Also Read: సీనియర్ హీరోయిన్ కి పబ్లిక్ గా పెళ్లి ప్రపోజల్.. వెంటనే ట్వీట్ డిలీట్..


Also Read:ఇండస్ట్రీ పెద్దగా నేను ఉండను.. ఆ స్థానం నాకొద్దు.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్..


Also Read:తల్లి కాబోతున్న కాజల్.. అసలు విషయం చెప్పేసిన గౌతమ్..


Also Read:రెజీనాతో చిరు స్టెప్పులు.. 'సానా కష్టం' ప్రోమో చూశారా..?


Also Read:దీప్తి బ్రేకప్ స్ట్రాటజీ.. సిరి బాయ్ ఫ్రెండ్ ఫాలో అవుతాడా..?


Also Read: ఆ అమ్మాయి మెడపై ముద్దు పెట్టిన సుధీర్ బాబు



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి