ఒకప్పుడు ఇండస్ట్రీ పెద్దగా దర్శకరత్న దాసరి నారాయణరావు గారు ఉండేవారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా.. ఆయన ఇంటి గడప తొక్కేవారు. అందరి సమస్యలను పరిష్కరిస్తూ.. ఇండస్ట్రీలో అందరినీ ఒక్కతాటిపై నడిపించేవాడు. ఆయన మరణం తరువాత ఆ స్థానం ఎవరిదనే విషయం మాత్రం ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయింది. కరోనా సమయంలో అందరికీ సాయం చేస్తూ.. విరాళాలు సేకరించి సినీ కార్మికులకు అందరించిన చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా ఉంటారనే వార్తలు వచ్చాయి. 


మురళీ మోహన్, తమ్మారెడ్డి లాంటి ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ఈ విషయంలో చిరుకి మద్దతుగా నిలిచారు. మరోపక్క మోహన్ బాబుకి మాత్రమే ఆ హక్కు ఉందంటూ సీనియర్ నటుడు నరేష్ అన్నారు. దీంతో ఆ స్థానం ఎవరికీ దక్కుతుందోననే విషయం ఆసక్తిగా మారింది. 


అయితే నిన్న జరిగిన ఓ ప్రెస్ మీట్ చిరంజీవి ఈ విషయంపై స్పష్టత ఇచ్చేశారు. ఇండస్ట్రీ పెద్ద అనే హోదా తనకు వద్దని.. ఎవరికి ఏ సాయం కావాలన్నా చేస్తాను కానీ.. ఆ స్థానంలో మాత్రం కూర్చోనని తేల్చి చెప్పేశారు. దీంతో మరోసారి ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఎవరు ఉంటారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా దర్శకుడు అజయ్ భూపతి ఈ విషయంపై స్పందించారు. 


'మా బాస్ రామ్ గోపాల్ వర్మని ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా చూడాలనేది నా కోరిక. సామీ మీరు రావాలి సామీ' అంటూ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఇది చూసిన నెటిజన్లు అజయ్ భూపతిని ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నాడు. 'వద్దు సామీ.. తనకోసం మాత్రమే బ్రతికే వాడెవడూ అందరికీ ఉపయోగపడలేడు' అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. 'ప్రేక్షకులం మేం జోక్స్ వేశామంటే ఒక లెక్క ఉంటాది. మీరు సిల్లీ జోక్స్ వేస్తే ఎలా..?' అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. 


Also Read:లెఫ్ట్ హ్యాండ్ రెడీ.. వాళ్లు ఎదురుపడితే దబిడిదిబిడే.. వార్నింగ్ ఇచ్చిన బాలయ్య..




Also Read: సీనియర్ హీరోయిన్ కి పబ్లిక్ గా పెళ్లి ప్రపోజల్.. వెంటనే ట్వీట్ డిలీట్..


Also Read:ఇండస్ట్రీ పెద్దగా నేను ఉండను.. ఆ స్థానం నాకొద్దు.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్..


Also Read:తల్లి కాబోతున్న కాజల్.. అసలు విషయం చెప్పేసిన గౌతమ్..





ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి