సైఫ్ అలీఖాన్ ముద్దుల కూతురు సారా అలీఖాన్. సెలెబ్రిటీ కిడ్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ సుందరి తక్కువ కాలంలోనే సొంతగుర్తింపును సాధించింది. ‘కేదార్ నాథ్’ సినిమాతో తెరంగేట్రం చేసింది సారా. ఆ తరువాత లవ్ ఆజ్ కల్, కూలీ నెం 1 సినిమాలలో నటించింది. ఆ తరువాత ఆమె చేసిన సినిమా ‘ఆత్రంగి రే’. ఈ సినిమాలో ధనుష్, అక్షయ్ కుమార్ హీరోలుగా నటించారు. ఇద్దరిని ప్రేమించే ప్రియురాలిగా సారా అద్భుతంగా నటించింది. ఆమె నటన ప్రేక్షకులకు చాలా నచ్చింది. ఆ సినిమా సక్సెస్ మీట్ లో సారా పాల్గొంది. అందులో మీడియా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.  ఆమెకు కాబోయే వాడి గురించి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. 

Continues below advertisement


తన సినిమా ఆత్రంగి రే చూసి అమ్మానాన్నలు గర్వంగా ఫీలయ్యారని, కళ్లనీళ్లు పెట్టుకున్నారని చెప్పింది సారా. తన అమ్మ అమృత గురించి చెబుతూ చాలా ఎమోషనల్ అయ్యింది. ఎప్పటికైనా తనకు తల్లే సర్వస్వమని చెప్పింది. ‘అమ్మతో ఉంటే నాకు సంతోషంగా ఉంటుంది. ఇప్పటికీ నేను కొన్ని విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకోలేను. అమ్మ సాయం అవసరం. మ్యాచింగ్ గాజులు, డ్రెస్సుల విషయంలో కూడా తల్లి సాయం తీసుకుంటా. లేకపోతే ఇలా ఇంటర్వ్యూలకూ కూడా హాజరకాలేను. నేను ఎక్కడికి వెళ్లిని తిరిగి అమ్మనే చేరుతా. అమ్మ చాలా ఎమోషనల్ పర్సన్. అందుకే అమ్మను విడిచి నేను ఉండలేను. పెళ్లి చేసుకున్నా కూడా... అమ్మతో పాటూ కలిసి జీవించే వ్యక్తినే ఎంచుకుంటా. ఎవరైతే మా అమ్మతో కలిసి ఉండటానికి ఒప్పుకుంటారో వారినే చేసుకుంటా’ అని చెప్పింది. 



Also Read: బాసూ... క్లాస్‌గా మెగాస్టార్ మాస్ స్టెప్పేస్తే? ఫుల్ సాంగ్ వచ్చేసింది... చూశారా?
Also Read: 'రాధే శ్యామ్' నిర్మాతలకు కొత్త తలనొప్పి... రోజుకు ఓసారి ఆ మాట చెప్పాల్సిందేనా?
Also Read: త్రివిక్రమ్ క్లాప్‌తో సినిమా మొదలు... బుధవారం నుంచి క్లాసులు!
Also Read: కృష్ణుడే సత్యభామ కాళ్లు పట్టుకున్నాడు... బాలకృషుడు ఓ లెక్కా!?
Also Read: లెఫ్ట్ హ్యాండ్ రెడీ.. వాళ్లు ఎదురుపడితే దబిడిదిబిడే.. వార్నింగ్ ఇచ్చిన బాలయ్య..
Also Read: The Boss: రామ్ గోపాల్ వర్మ బాబాగా మారితే?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి