క‌థ‌కు, కంటెంట్‌కు ఇంపార్టెన్స్ ఇచ్చే కథానాయకుడు ధనుష్. వైవిధ్యమైన కథలు-విలక్షణ పాత్రలు ఎంపిక చేసుకుని సినిమాలు చేయడం ఆయన శైలి. జాతీయ పురస్కారం అందుకున్న ఆయనతో ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలోని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్)తో కలిసి నిర్మిస్తున్న సినిమా 'సార్' (తమిళంలో 'వాతి'). ఇందులో సంయుక్తా మీనన్ హీరోయిన్. 'భీమ్లా నాయక్' సినిమాతో ఆమె తెలుగు పరిశ్రమకు పరిచయం కానున్నారు. అందులో రానాకు జంటగా నటించగా... ఆ సినిమా తర్వాత సితారలో మరో సినిమా 'సార్' చేసే అవకాశం ఆమెను వరించింది. ఈ ద్విభాషా సినిమా నేడు (జనవరి 3, సోమవారం) పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.
ధనుష్, సంయుక్తా మీనన్... హీరో హీరోయిన్లు ఇద్దరి మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సుప్రసిద్ధ దర్శకులు త్రివిక్రమ్ క్లాప్ ఇచ్చారు. ప్రముఖ పారిశ్రమికవేత్త సురేష్ చుక్కపల్లి, ప్రముఖ నిర్మాత డా. కేఎల్ నారాయణ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) స్క్రిప్ట్ అందచేశారు. నిర్మాత ఎం.ఎల్. కుమార్ చౌదరి, ప్రగతి ప్రింటర్స్ అధినేత మహేంద్ర  తదితరులు చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు అందచేశారు. ఇటీవ‌ల‌ 'రంగ్‌దే' చిత్రానికి దర్శకత్వం వహించిన వెంకీ అట్లూరి, ఈ 'సార్'/'వాతి' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read: SIR Movie: 'భీమ్లా నాయక్' బ్యూటీకి మరో క్రేజీ సినిమాలో ఛాన్స్!
జనవరి 5 నుంచి హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని నిర్మాతలు తెలిపారు. విద్యావ్యవస్థ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. బుధవారం నుంచి ధనుష్ క్లాసులు చెప్పడం స్టార్ట్ చేస్తారన్నమాట. 'యాన్ యాంబిషియ‌స్ జ‌ర్నీ ఆఫ్ ఎ కామ‌న్ మ్యాన్' స్లోగన్‌తో విడుదల చేసిన సినిమా ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.





'సూదు కవ్వం', 'సేతుపతి', 'తెగిడి', 'మిస్టర్ లోకల్', 'మార' తదితర చిత్రాలకు పనిచేసి దినేష్ కృష్ణన్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ కాగా... నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ఈ చిత్రానికి పని చేస్తున్నారు. జీవీ ప్ర‌కాష్‌ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సాయి కుమార్,తనికెళ్ల భ‌ర‌ణి, నర్రా శ్రీను తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: ఎస్‌. వెంక‌ట‌ర‌త్నం (వెంక‌ట్‌), ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: అవినాష్ కొల్లా, స‌మ‌ర్ప‌ణ: పి.డి.వి. ప్ర‌సాద్‌, నిర్మాత‌లు: నాగ‌వంశీ ఎస్‌. - సాయి సౌజ‌న్య‌.
Also Read: కృష్ణుడే సత్యభామ కాళ్లు పట్టుకున్నాడు... బాలకృషుడు ఓ లెక్కా!?
Also Read: లెఫ్ట్ హ్యాండ్ రెడీ.. వాళ్లు ఎదురుపడితే దబిడిదిబిడే.. వార్నింగ్ ఇచ్చిన బాలయ్య..
Also Read: The Boss: రామ్ గోపాల్ వర్మ బాబాగా మారితే?
Also Read: RGV: ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఆర్జీవీ.. అజయ్ భూపతిని ఆడేసుకుంటున్నారుగా..
Also Read: బాలకృష్ణ సినిమాలో కన్నడ నటుడికి పవర్ ఫుల్ రోల్...
Also Read: త్వరలో తల్లి కానున్న హీరోయిన్... విడాకులు తీసుకున్నారా?
Also Read: 'భీమ్లా నాయ‌క్' డేట్ మీద క‌న్నేసిన రాజ'శేఖ‌ర్‌'... సంక్రాంతి బ‌రిలో మ‌రో యాంగ్రీ స్టార్‌!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి