దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదల వాయిదా పడినప్పటి నుంచి... 'రాధే శ్యామ్' విడుదల విషయంలో సందేహాలు నెలకొన్నాయి. ఎందుకంటే... రెండూ పాన్ ఇండియా సినిమాలే. తెలుగు మార్కెట్‌ను మాత్ర‌మే కాదు, నేష‌న‌ల్ మార్కెట్‌ను న‌మ్మ‌కుని తీసిన సినిమాలు. ఢిల్లీలో థియేటర్లు క్లోజ్ చేయడం, మహారాష్ట్రలో సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే షోలు వేయడానికి అనుమతులు ఇవ్వడం, తమిళనాడులో 50 శాతం ఆక్యుపెన్సీతో షోలు వేయమని చెప్పడంతో 'ఆర్ఆర్ఆర్'ను వాయిదా వేశారు. కేరళలో 50 శాతం ఆక్యుపెన్సీతో 'పుష్ప' విడుదల అయ్యింది. ఆ తర్వాత తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో 'ఆర్ఆర్ఆర్' వాయిదా పడింది.


ప్రస్తుత పరిస్థితుల్లో బడ్జెట్ రికవరీ కష్టమని 'ఆర్ఆర్ఆర్' వాయిదా వేసినప్పుడు... 'రాధే శ్యామ్'కు ఎలా వర్కవుట్ అవుతుందనేది కొందరిలో మొదలైన సందేహం. అందుకని, రోజుకు ఒకసారి సినిమా విడుదల వాయిదా పడిందని వదంతులు సృష్టిస్తున్నారు. దాంతో రోజుకు ఒకసారి అయినా "రూమ‌ర్స్‌ను న‌మ్మ‌వ‌ద్దు. 'రాధే శ్యామ్' విడుదల ప్లాన్‌లో ఎటువంటి మార్పు లేదు. ప్రభాస్ నటించిన ఈ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తుంది" అని యూనిట్ వర్గాలు చెబుతూ వస్తున్నాయి.
Also Read: 'భీమ్లా నాయ‌క్' డేట్ మీద క‌న్నేసిన రాజ'శేఖ‌ర్‌'... సంక్రాంతి బ‌రిలో మ‌రో యాంగ్రీ స్టార్‌!
ఉత్తరాదిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, కొన్ని రాష్ట్రాలు సినిమా షోస్ మీద ఆంక్షలు విధించిన తరుణంలో 'రాధే శ్యామ్' నిర్మాణంలో భాగస్వామి అయిన టీ సిరీస్ సంస్థ‌కు సినిమాను విడుదల చేయడం ఇష్టం లేదని, విడుదల వాయిదా వేయమని ప్రభాస్ టీమ్‌కు తెలియజేసిందని సోషల్ మీడియాలో వదంతి సృష్టించారు. ప్రభాస్ ఇంకా ఇంటర్వ్యూస్ ఇవ్వడం లేదనే అంశాన్ని చూపించి, సినిమా వాయిదా పడిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి సినిమా వాయిదా పడలేదని టీమ్ స్పష్టం చేసింది.
Also Read: ఒక్క పోస్ట‌ర్‌, ఒక్క డేట్‌తో రూమ‌ర్స్‌కు చెక్ పెట్టిన 'రాధే శ్యామ్' టీమ్‌!
'ఆర్ఆర్ఆర్' వాయిదా పడిన తర్వాత 'రౌడీ బాయ్స్', '7 డేస్ 6 నైట్స్', 'సూపర్ మచ్చి', 'హీరో' సినిమాలు సంక్రాంతి బరిలో దిగుతున్నట్టు ప్రకటించాయి. జనవరి 14, 15 తేదీల్లో ఈ సినిమాలు వస్తున్నాయి. రాజశేఖర్ హీరోగా నటించిన 'శేఖర్' విడుదల తేదీ ప్రకటించలేదు గానీ... అదీ సంక్రాంతి బరిలో దిగడానికి రెడీ అవుతోంది. అయితే... ప్రస్తుతానికి 'రాధే శ్యామ్' టీమ్‌కు వెనక్కి వెళ్లే ఉద్దేశం లేదట.


Also Read: త్రివిక్రమ్ క్లాప్‌తో సినిమా మొదలు... బుధవారం నుంచి క్లాసులు!
Also Read: కృష్ణుడే సత్యభామ కాళ్లు పట్టుకున్నాడు... బాలకృషుడు ఓ లెక్కా!?
Also Read: లెఫ్ట్ హ్యాండ్ రెడీ.. వాళ్లు ఎదురుపడితే దబిడిదిబిడే.. వార్నింగ్ ఇచ్చిన బాలయ్య..
Also Read: The Boss: రామ్ గోపాల్ వర్మ బాబాగా మారితే?
Also Read: RGV: ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఆర్జీవీ.. అజయ్ భూపతిని ఆడేసుకుంటున్నారుగా..
Also Read: బాలకృష్ణ సినిమాలో కన్నడ నటుడికి పవర్ ఫుల్ రోల్...
Also Read: త్వరలో తల్లి కానున్న హీరోయిన్... విడాకులు తీసుకున్నారా?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి