కొత్త తరం మహీంద్రా ఎక్స్‌యూవీ700ను లాంచ్ చేశాక.. భారతీయ కార్ల బ్రాండ్ మహీంద్రా కొత్త తరం స్కార్పియోను లాంచ్ చేయడానికి సిద్ధం అవుతుంది. ఈ కొత్త స్కార్పియోను కంపెనీ ఎప్పటినుంచో పరీక్షిస్తుంది. 2019 నుంచి దీనికి సంబంధించిన టెస్టింగ్ ప్రారంభం అయింది. ఆ తర్వాత కూడా కొన్ని సార్లు స్కార్పియో టెస్టింగ్ మోడల్స్ కనిపించింది.
అయితే వీటిలో తాజా వేరియంట్ ఇటీవలే కనిపించింది. ఇప్పటి వరకు కనిపించిన ప్రతి మోడల్ ఏదో ఒక సమాచారాన్ని అందించింది. అలాగే తాజాగా కనిపించిన వేరియంట్ కూడా దీనికి సంబంధించి కొత్త ఫీచర్లను రివీల్ చేసింది. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్ ఉండనుంది.
కొత్త తరం స్కార్పియోలో అన్నీ లేటెస్ట్ ఫీచర్లను అందించాలని కంపెనీ అనుకుంటుంది కాబట్టి.. పనోరమిక్ సన్‌రూఫ్ కూడా అందులో భాగం అయింది. అయితే ఇది కేవలం స్కార్పియో టాప్ ఎండ్ వేరియంట్లో మాత్రమే ఉండే అవకాశం ఉంది.
ఈ కొత్త తరం స్కార్పియోలో పెద్ద టచ్ స్క్రీన్, టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఉన్న సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ ఏసీ, యాంబియంట్ లైటింగ్, వెనక వరుసల సీట్లకు డెడికేటెడ్ ఏసీ వెంట్స్, వైర్‌లెస్ స్మార్ట్ ఫోన్ చార్జర్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉండనున్నాయి. ఫోర్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఇందులో అందించే అవకాశం ఉంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్కార్పియో కంటే త్వరలో రానున్న మోడల్ లుక్ కొంచెం కొత్తగా ఉండనుందని అనుకోవచ్చు. కారు ఆకారంలో పెద్దగా మార్పు లేకపోయినా.. మరింత పెద్ద ట్రాక్ ఇందులో అందించనున్నారు. కారు ముందు భాగం లుక్ కూడా మారే అవకాశం ఉంది. ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఆక్టాగోనల్ గ్రిల్, ఫ్రంట్ స్కిడ్ ప్లేట్ కూడా ఇందులో అందించనున్నారు.
2.2 లీటర్ డీజిల్ పవర్ ప్లాంట్ ఇంజిన్‌ను 2022 మహీంద్రా స్కార్పియోలో అందించే అవకాశం ఉంది. 138 బీహెచ్‌పీ, 320 ఎన్ఎం టార్క్‌ను అది అందించనుంది. దీంతోపాటు.. 2.0 లీటర్ ఎంస్టాలియన్ ఇంజిన్‌ను కూడా ఇందులో అందించనున్నారు. ఇదే ఇంజిన్‌ను కొత్త థార్‌లో కూడా అందించారు.
Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేసింది.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. డిజైన్ సూపర్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?