కియా కారెన్స్ ఆర్‌వీ మనదేశంలో లాంచ్ అయింది. కియా మనదేశంలో లాంచ్ చేసిన నాలుగో ఉత్పత్తి ఇదే. ఇందులో మూడు వరుసల సీట్లు ఉన్నాయి. కార్నివాల్ కంటే తక్కువ రేంజ్‌లో దీన్ని లాంచ్ చేశారు. సెల్టోస్ ప్లాట్‌ఫాంపై కారెన్స్‌ను రూపొందించారు. కానీ దీని డిజైన్ డిఫరెంట్‌గా ఉండనుంది.


ఇందులో పెద్ద హెడ్ ల్యాంప్స్ అందించారు. రెండు పార్టుల డిజైన్‌తో ఈ ల్యాంప్స్‌ను డిజైన్ చేశారు. ఇవి ఎల్ఈడీ యూనిట్స్. వీటితో పాటు డీఆర్ఎల్స్ కూడా ఉన్నాయి. దీని సైడ్ డిజైన్ సింపుల్‌గా ఉంది. దీంతోపాటు క్లాడింగ్, రూఫ్ రెయిల్స్ కూడా ఉన్నాయి. కారు వెనకవైపు ఫుల్ లెంత్ లైట్ బార్ ఉంది.


దీని గ్లాస్ ఏరియా కూడా పెరిగింది. మూడో వరుస సీట్లకు కొంచెం ఎక్కువ గ్లాస్ ఏరియాను అందించారు. సిక్స్ సీటర్, సెవన్ సీటర్ వేరియంట్లలో ఈ కారు అందుబాటులో ఉంది. దీని ఇంటీరియర్ చూసుకుంటే 10.25 అంగుళాల టచ్ స్క్రీన్‌ను అందించారు.


సన్‌రూఫ్, ఎయిర్ ప్యూరిఫయర్, కనెక్టెడ్ టెక్, యాంబియంట్ లైటింగ్, రేర్ టేబుల్, ఇంటిగ్రేటెడ్ కప్ హోల్డర్స్ కూడా ఇందులో ఉన్నాయి. టచ్ స్క్రీన్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు. డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్ కూడా ఇందులో ఉంది.


1.4 టర్బో పెట్రోల్ మోటార్‌ను అందించారు. డీసీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కూడా ఇందులో ఉండనుంది. 1.5 లీటర్ డీజిల్, 1.5 లీటర్ పెట్రోల్ వేరియంట్లు ఇందులో ఉండనున్నాయి. 1.5 లీటర్ పెట్రోల్ వేరియంట్‌లో 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా సీవీటీ ఆటోమేటిక్ ఆప్షన్ ఉండనుంది. దీనికి సంబంధించిన గ్లోబల్ రివీల్ కూడా ఇప్పటికే జరిగింది. కారు వచ్చే సంవత్సరం లాంచ్ కానుంది.


Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!


Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. డిజైన్ సూపర్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?


Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి