సరిగ్గా ఏడాది క్రితం ఈ కరోనా వ్యాక్సిన్లు జోరుగా పెద్దవాళ్లకు వేయడం ప్రారంభమైంది. ఇప్పుడు పిల్లల వరకు వచ్చింది. అది కూడా టీనేజీ పిల్లలకే పరిమితం. 15 ఏళ్లు పైబడిన వారందరూ ఈ టీకాకు అర్హులు. త్వరలో 12 ఏళ్లు పైబడిన పిల్లలకు కూడా టీకాలు వేసే ఛాన్సు ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం 2007వ సంవత్సరంలో, అంతకన్నా ముందు పుట్టిన వారందరూ టీకాకు అర్హులే.
ఏ టీకా వేస్తున్నారు?
పిల్లల కోసం అందుబాటులో ఉన్న ఏకైనా టీకా భారత్ బయోటెక్ వారి కోవాక్సిన్. అత్యవసర పరిస్థితుల్లో దీన్ని 12 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు ఉపయోగించవచ్చు. కోవిన్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ చెప్పినట్టు పిల్లల కోసం కోవాక్సిన్ తో పాటూ జైకోడ్ డి వ్యాక్సిన్ కూడా ఆమోదం పొందింది. కానీ ఈ వ్యాక్సిన్ మన దేశంలో ఉపయోగించడం మొదలవ్వలేదు. 12-18 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలకు ఉపయోగించడానికి ఆమోదించిన మొదటి కోవిడ్ వ్యాక్సిన్ జైకోడ్ డి. కానీ దేశంలో అందుబాటులో లేదు. అందుకే కోవాక్సిన్ మాత్రమే ఇప్పుడు పిల్లల కోసం అందుబాటులో ఉంది.
రిజిస్టర్ చేయండి
ప్రస్తుతం 15-18 ఏళ్ల లోపు టీనేజీ పిల్లలకే కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు. జనవరి 1 నుంచి కోవిన్ లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. పిల్లల ఆధారకార్డుతో కోవిన్ యాప్‌లో స్లాట్‌ను బుక్ చేసుకోవాలి.
సైడ్ ఎఫెక్టులు ఉంటాయా?
పిల్లల వైద్యులు చెప్పిన ప్రకారం వ్యాక్సిన్ తీసుకున్న పిల్లల్లో తీవ్రమైన దుష్ప్రభావాలు కనిపించవు. పెద్దల్లాగే జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి రెండు రోజులు ఉండే అవకాశం ఉంది. పారాసెటమాల్ ట్యాబ్లెట్ వాడితే చాలు.
జ్వరం వస్తే మంచిదే
టీకా తీసుకున్న తరువాత జ్వరం, ఒళ్లు నొప్పులు వంటివి కనిపిస్తే మంచిదే. మీ రోగనిరోధక వ్యవస్థ టీకాకు ప్రతిస్పందిస్తోందని అర్థం. అంటే వైరస్ సోకినప్పుడు దాన్ని ఎదుర్కోడానికి అది సిద్ధమవుతోంది. అలాగని జ్వరం రాకపోతే టీకా పనిచేసినట్టు కాదని చెప్పలేం.
Also read: సజ్జ రొట్టె లేెదా జొన్న రొట్టె... ఈ రెండింటిలో బరువు తగ్గేందుకు ఏది తింటే బెటర్?
Also read: ఆవలింతలు వస్తున్నాయా... అయితే మెదడు మీకేదో చెప్పాలనుకుంటోంది
Also read: అతిగా నీళ్లు తాగితే ఎంత ప్రమాదమో తెలుసా?