Makar Sankranti 2022: మకర సంక్రాంతి రోజు సూర్యుడి ఆశీర్వాదం కావాలంటే ఇలా చేయకుండా ఉంటే చాలు...

మకర సంక్రాంతి రోజు ఇది చేయాలి, అది చేయాలని తెగ ప్లాన్స్ వేసుకుంటారు. అయితే ఏం చేయకూడదో క్లారిటీ ఉంటే ఏం చేయాలో తెలిసినట్టే కదా.. ఏంటీ కన్ఫ్యూజ్ అయ్యారా.. ఈ స్టోరీ చూడండి మీకే అర్థమవుతుంది...

Continues below advertisement

స్నానం చేయకుండా ఏమీ తినొద్దు...
చాలామందికి బెడ్ కాఫీ, బెడ్ టీ తాగే అలవాటు ఉంటుంది. ఇంకొందరైతే లేచి బ్రష్ చేయగానే టిఫిన్ లాగించేస్తారు. దానికి రకరకాల కారణాలు చెబుతారు. మరీ  మంచానికే పరిమితమైన రోగులకు తప్పదు కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు కూడా ఎక్కువ ఫీలై ఆకలి అనిపించగానే తినేస్తారు. అయితే పెద్ద పండుగగా భావించే సంక్రాంతి రోజైనా స్నానం చేసి సూర్యుడికి అలా ఓ నమస్కారం చేశాకే తినండి. 

Continues below advertisement

Also Read: భోగి పళ్లుగా రేగు పళ్లు ఎందుకు పోస్తారు… వీటికి-దిష్టికి ఏంటి సంబంధం…
చెట్లు కొట్టొద్దు..
హిందువులు చెట్టు, పుట్ట, ప్రకృతి ఇలా అన్నింటినీ పూజిస్తారు. అన్నింటినీ దైవ స్వరూపంగా భావిస్తారు. గ్రామాల్లో అయితే కొన్ని చెట్లను దేవతా స్వరూపాలుగా భావిస్తారు. మకర సంక్రాంతిని ప్రకృతి పండుగ అంటారు..పంట చేతికి రావడంతో ప్రకృతికి, పశువులకు కృతజ్ఞతలు చెబుతూ వాటికి పుసుపు, కుంకం అందిస్తాం. అలాంటప్పుడు చెట్లు నరికేయడం లాంటి ప్రకృతి విరుద్ధమైన పనులు చేయవద్దు. ఇప్పటికే నీళ్లు కొనుక్కుంటున్న మనం...కరోనా దెబ్బకి గాలికూడా కొనుక్కుంటున్నాం...అందుకే చెట్లను దైవ స్వరూపాలుగా భావించకపోయినా పర్వాలేదు కానీ మనకు ప్రాణవాయువు అందించే వైద్యులుగా భావించి అయినా ప్రకృతిని నాశనం చేసే ఆలోచన మానుకోండి. 

Also Read: అన్నమయ్య పాటల్లోనూ సంక్రాంతి గొబ్బిళ్లకు ప్రత్యేక స్థానం...
సూర్యుడు, శని అనుగ్రహం పొందాలంటే 
మకర సంక్రాంతి రోజు ఆటలు, కోడి పందాలు, కొత్త అల్లుళ్లు సందళ్లలో పడి మత్తు పదార్థాలపై మొగ్గుచూపుతారు. కానీ ఇది చాలా తప్పు అంటారు పండితులు. ఈ రోజు మద్యం తీసుకోవడం, మసాలా ఆహారం తినడం రెండూ మంచిది కాదంటారు. సూర్యుడు, శని అనుగ్రహంతో ఆరోగ్యంగా ఉండాలంటే  నువ్వులు, చిక్కీ,  ఖిచ్డి, కొత్త బియ్యంతో చేసిన పిండి వంటలు తినొచ్చు. ఈ పెద్ద పండుగ వేళ ఆహార నియమాలు కచ్చితంగా పాటించాలి.
 
బిచ్చం అంటూ ఇంటిముందు నిల్చున్న వారిని ఖాళీగా పంపొద్దు..
అయ్యా ..అమ్మా...అంటూ మీ ఇంటి ముంచు ఖాళీ పాత్రతో నిల్చునే వారికి ఊరికే పంపేయవద్దు. పండుగ రోజున వాళ్ళకి దానం చేయండి. 

Also Read: ఏడాదంతా పండుగలే.. మరి సంక్రాంతినే పెద్దపండుగ అంటారెందుకు...
ఆగ్రహం, ఆవేశాలకు దూరంగా ఉండండి
సూర్యుడు దిశ మార్చుకున్నట్టే.. ఇప్పటి వరకూ మనల్ని పట్టి పీడిస్తున్న కోపతాపాలు వదిలిపెట్టి సరికొత్త వెలుగును మీ జీవితంలోకి ఆహ్వానించేందుకు ప్రయత్నించండి. అనవసరంగా ఎవ్వరితోనూ వివాదం పెట్టుకోవద్దు, సరదా అలకలు-బుజ్జగింపులు వరకూ ఓకే కానీ మన అనుకున్న వారు బాధపడేలా ప్రవర్తించకండి. మన అనుకున్న వారితో మాత్రమే కాదు ఎవ్వరితోనూ చెడుగా మాట్లాడవద్దు....

ఏ భావమూ లేకుండా అందరిపట్లా ఒకేలా ప్రవర్తించడానికి మనం దేవుళ్లం కాదు..సందర్భాను సారం రియాక్టవకుండా ఉండలేం...కానీ...మనలోనూ దేవుడున్నాడని చెప్పేందుకు చిన్న చిన్న మార్పులు మాత్రమే ఇవన్నీ.. పాటించేద్దాం..మహా అయితే ఏముంది మనల్ని తిరిగి ప్రేమించే వారి సంఖ్య పెరుగుతుంది...

Also Read: గతేడాది ఎలా చేశారో తెలియదు కానీ… ఈ సంక్రాంతికి ఇలా చేయండి
Also Read: తిరుమల శ్రీవారిని మొదటి గడప నుంచి దర్శించుకునే అవకాశం.. సామాన్యుడి కల తీరినట్టేనా....!
Also Read: ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి..
Also Read: 11 ఇంద్రియాలపై నియంత్రణే వైకుంఠ ఏకాదశి దీక్షలో ఆంతర్యం
Also Read:  సంక్రాంతికి శ్రీశైలం మల్లన్న కల్యాణం, భక్తులకు ఈ నిబంధనలు తప్పనిసరి...
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement
Sponsored Links by Taboola