సరతి చరతీతి సూర్యః" అంటే సంచరించేవాడని అర్థం. సూర్యుడి సంచారం రెండు విధాలుగా ఉంటుంది ఒకటి ఉత్తరాయణం , రెండోది దక్షిణాయణం. మనకు ఏడాది కాలం దేవతలకు ఒక్కరోజుతో సమానం.
 "ఆయనే దక్షిణే రాత్రిః ఉత్తరేతు దివా భవేత" 
అంటే ఆరుమాసాల ఉత్తరాయణ కాలం దేవతలకు పగలు. దక్షిణాయణం రాత్రి. 
"సంక్రాంతి" లేదా "సంక్రమణం" అంటే "చేరడం" లేదా "మారడం"అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశుల్లో మారుతూ పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి.  మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందంటే..రవి మకర రాశిలో ప్రవేశించినపుడు ఎవరైతే భక్తిశ్రద్ధలతో స్నానమాచరించడో అలాంటి వాడు ఏడు జన్మలు రోగిగా, దరిద్రుడిగా ఉండిపోతాడని అంటారు. 


Also Read:  శబరిమలలో మకరజ్యోతి దర్శనార్థం వచ్చిన భక్తుల శరణు ఘోష .. 18 పడిమెట్లు వెనుకున్న ఆంతర్యం ఏంటి...
ఉత్తరాయణ పుణ్యకాలం అని ఎందుకంటారు
ఉత్తరాయణం పుణ్యకాలం అంటారు కాబట్టి  దక్షిణాయణం పాపకాలం అని అర్ధం చేసుకోకూడదు. దక్షిణాయణం కూడా పుణ్య కాలమే.. అయితే ఉత్తరాయణం విశిష్టత వేరు.  ఉత్తరాయణంలో లయ కారకుడైన పరమశివుడు మేలుకుని ఉంటాడు, ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉడడం వలన పుణ్య క్షేత్రాలు , తీర్ధ యాత్రలకు అనువుగా వుంటుంది. మనం ఉత్తర దిక్కును , ఉత్తర భూములనూ పవిత్రంగా భావించడం, వేద జననం ఉత్తర భూముల్లో జరగడం , హైందవ సంస్కృతి , జ్ఞాన విజ్ఞానం , భాష , నాగరికత ఉత్తరాది నుండి దక్షిణాది వైపు రావడం,  సమస్త భాషలకూ తల్లి అయిన సంస్కృతం ఉత్తరాదిన పుట్టడం , సమస్త ఋషులకూ , దేవతలకూ , పండితులకూ ఉత్తర భూములే నివాస స్థానాలు కావటం వీటితో పాటూ  ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు ఉత్తర పధ చలనం చేయడం వల్ల ఉత్తరాయణ కాలాన్ని పుణ్యకాలంగా భావిస్తారు. 


Also Read: శనివారం మకర సంక్రాంతి... మీపై శనిప్రభావం ఉండకూడదనుకుంటే ఇలా చేయండి..
సూర్య గమన్నాని బట్టి వాతావరణంలో మార్పులు
సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు ఒక వైపు అనగా దక్షిణం వైపు మరో ఆరు నెలలు ఒకవైపు ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు. భూమిపై రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయని సూర్యుడు భూమిపై దక్షిణం వైపు పయనిస్తున్నంత కాలం రాత్రిగాను , ఉత్తరం వైపు పయనిస్తున్నంత కాలం పగలు గాను అభివర్ణించారు. మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏ విధంగా మేలుకుంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయణంలో మేల్కొని ఉంటారని ఈ సమయంలో భక్తితో ఏం కోరుకున్నా దేవతలు తీరుస్తారని పండితులు చెబుతారు. ఈ  విషయం అందరికీ తెలియజేయడం కోసం పెద్దలు ఈ పండుగను పెద్ద పండుగగా జరపడం మొదలెట్టారట. 


Also Read: బసవన్నగా శివయ్య , హరిదాసుగా శ్రీహరి .. ఆ సంబరమే వేరప్పా…
మనం నిద్రలేవగానే ఇంటి తలుపులు తీసినట్టే ఉత్తరాయణం ప్రారంభమైన ఈ రోజున దేవతలు నిద్రలేవడంతో ఈ ఆరు నెలలు స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయి. వాస్తవానికి ప్రతి సంక్రాంతికి పితృతర్పణాలు ఇవ్వాలి...ముఖ్యంగా మకర సంక్రాంతికి మాత్రం మిస్ చేయకూడదని చెప్పడం వెనుక కారణం కూడా ఇదే.  ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైనా శ్రేష్టమైందని చెబుతారు. 


Also Read: సంక్రాంతి అనగానే మహానగరాల నుంచి పల్లెబాట పడతారెందుకు...
Also Read:  అన్నమయ్య పాటల్లోనూ సంక్రాంతి గొబ్బిళ్లకు ప్రత్యేక స్థానం...
Also Read: ఏడాదంతా పండుగలే.. మరి సంక్రాంతినే పెద్దపండుగ అంటారెందుకు...
Also Read: గతేడాది ఎలా చేశారో తెలియదు కానీ… ఈ సంక్రాంతికి ఇలా చేయండి
Also Read:  మకర సంక్రాంతి రోజు సూర్యుడి ఆశీర్వాదం కావాలంటే ఇలా చేయకుండా ఉంటే చాలు...
Also Read:  సంక్రాంతికి శ్రీశైలం మల్లన్న కల్యాణం, భక్తులకు ఈ నిబంధనలు తప్పనిసరి...