ఒకప్పుడు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతం పార్టీ నుంచి చాలా మంది టీఆర్ఎస్, బీజేపీల వైపు వెళ్లిపోయారు. గతంలో 9 నియోజకవర్గాలకు తొమ్మిదింటిలో క్లీన్  స్వీప్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. టీఆర్ఎస్ ఆధికారంలోకి వచ్చాక... ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీని వీడి కారు ఎక్కారు. ఎంతటి ఉద్యమం ఊపు ఉన్నా జిల్లా నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాగానే గెలిచారు.


అదంతా గతం ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. రాను రాను జిల్లా కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు పూర్తిగా మారిపోతూ వచ్చాయ్. జిల్లాలో నాయకత్వం కొరవడిందన్న చర్చ ఆ పార్టీలోనే జరుగుతోంది. రేవంత్ రెడ్డి వచ్చాక మొదట్లో కొంత హడావుడి కనిపించినా... ఇప్పుడు పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది. జిల్లాలో ప్రస్తుతం సీనియర్ నాయకులుగా పేరున్న మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఉన్నారు. టీపీసీసీలో జిల్లాకు చెందిన ఇద్దరు నాయకులు కీలక పదవుల్లో ఉన్నారు. అందులో బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెండ్ గా.. మాజీ ఎంపీ మధుయాష్కీ ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నారు. గతంలో పార్టీని వీడిన వారిని తిరిగి పార్టీలోకి చేర్చే విషయంలో జిల్లా నాయకులు అంతగా సక్సెస్ కాలేకపోతున్నారన్న ప్రచారం జరుగుతోంది.  టీఆర్ఎస్, బీజేపీలో ఉన్న చాలా మంది నాయకులు కాంగ్రెస్ నుంచి వెళ్లిన వారున్నారు. రేవంత్ రెడ్డి వచ్చాక తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని అనుకున్నా ఆ దిశగా ప్రస్తుతం జిల్లాలో ఉన్న సీనియర్ నాయకులు చర్యలు చేపట్టడం లేదన్నవాదనలు ఆ పార్టీలోనే వినిపిస్తున్నాయ్.


ఒప్పుడు జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో శాసించిన డీఎస్ నాటి పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం డీఎస్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతారన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. అయితే డీఎస్ రీ ఎంట్రీని జిల్లాకు చెందిన కొంతమంది నాయకులు వ్యతిరేకించారన్న ప్రచారం జరిగింది. జిల్లా కాంగ్రెస్ లో కొందరికి డీఎస్ రావాలని ఉన్నా... కొంత మంది నాయకులు వ్యతిరేకించారని తెలుస్తోంది. 


డీఎస్ పెద్ద కొడుకు సంజయ్ భాహటంగానే కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నట్లు ప్రకటించినప్పటికీ... కొందరు జిల్లాకు చెందిన సీనియర్ నేతలు అధిష్ఠానం వద్ద అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు కూడా చాలానే ఉండేది. అయితే పార్టీ క్యాడర్ కాపాడుకునే నాయకుడు కరవయ్యారన్న చర్చ ఆ పార్టీలో జరుగుతోంది. కార్యకర్తలను పట్టించుకునే సరైన నాయకుడు లేరన్న వాదన వినిపిస్తోంది. జిల్లాలో మెంబర్ షిప్ డ్రైవ్ కూడా గతంలో జరిగినట్లు చేయటం లేదన్న ఆరోపణలు ఆ పార్టీలోనే వినిపిస్తున్నాయ్.


కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మెంబర్ షిప్ డ్రైవ్ చేస్తోంది. ఇందులో టెక్నికల్ గా చాలా సమస్యలు ఉన్నాయట. ఎన్ రోల్ మెంట్ కష్టంగా మారిందంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకుంటే రూ.2 లక్షల ఇన్సూరెన్స్ కూడా ఇస్తామని ప్రకటించినా.... డిజిటల్ లో కావటంతో చాలా మందికి సభ్యత్వం ఎలా చేసుకోవాలో తెలియని పరిస్థితి. అందుకే సభ్యత్వం కూడా ఆశించిన స్థాయిలో జరగటం లేదన్న వాదనలూ వినిపిస్తున్నాయ్.


పార్టీని బలోపేతం చేసే దిశగా పార్టీలోకి రావలని ఇంట్రస్ట్ ఉన్న వారిని గుర్తించి చేర్చుకునే విషయంపైనా జిల్లా సీనియర్ నాయకులు పట్టించుకోవటం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయ్. జిల్లాలో సామాజిక  లెక్కల ప్రకారం పార్టీ పదవులు ఇవ్వలేదన్నచర్చ కూడా ఉంది. ఒకే సామాజిక వర్గం నుంచి ఇద్దరు నేతలకు టీపీసీసీలో కీలక పదవులు ఇవ్వటంపైనా జిల్లాలో కొందరు సీనియర్ నాయకులకు మింగుడుపడలేదని తెలుస్తోంది. ఓ వైపు టీఆర్ఎస్, బీజేపీ జిల్లాలో పార్టీని సంస్థాగతం బలోపేతం చేసేందుకు కృషి చేస్తుంటే.... కాంగ్రెస్ మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోవటం లేదన్న వాదనలున్నాయ్. జిల్లాలో పలు ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాటం చేయటం లేదన్న వాదన ఉంది.


Also Read: Profitable Tulasi Farming: తులసి మెుక్కల పెంపకం.. 3 నెలల్లో 3 లక్షలు సంపాదించొచ్చు.. సరిగా ప్లాన్ చేసుకుంటే చాలు..


Also Read: Bandi Sanjay: సకినాల పిండి కన్నీళ్లతో కలుపుతున్నారు, సిగ్గులేకుండా మోదీకి లేఖ రాస్తావా? సీఎంకు బండి సంజయ్ లేఖ


Also Read: Nalgonda Crime: నరబలిగా భావిస్తున్న కేసులో దొరికిన మొండెం.. నాలుగు రోజుల తర్వాత ఎక్కడ గుర్తించారంటే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి