తులసి చెట్టు ద్వారా అనేక ప్రయోజనాలు పొందొచ్చు. బ్రహ్మాండమైన ఔషధ గుణాలు ఉన్న చెట్టు. తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకూ అనేక రకాల వ్యాధులకు దీనిని ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో వైద్య మూలికగానూ ఉపయోగపడతుంది. మెుక్క విత్తనాల నుంచి లేదా.. మెుక్కలు తెచ్చి కూడా దీనిని పెంచొచ్చు. సాధారణంగా చాలామంది ఇంటి ముందర తులసి చెట్టు దర్శనం ఇస్తుంది. అయితే వ్యవసాయం చేసేవాళ్లు.. తులసి మెుక్కలను పెంచడం ద్వారా కూడా.. లక్షలు సంపాదించొచ్చు. మార్కెట్ లో తులసికి మంచి డిమాండ్ ఉంది.
మెడిసినల్ ప్లాంట్ అని చెప్పుకునే... తులసి మెుక్కను అనేక మందుల తయారీలోనూ వాడుతారు. ఇక ఈ మధ్య కాలంలోనూ.. తులసి వాడకం ఏదో విధంగా ఎక్కువైందనే చెప్పొచ్చు. కరోనా సమయంలో దీని ఔషధ గుణాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆయుర్వేద మెడిసిన్స్ తయారీలో తులసిని ఎక్కువగానే ఉపయోగిస్తారు. అయితే.. కేవలం 15,000 రూపాయల పెట్టుబడి పెట్టి.. తులసి మెుక్కలను పెంచి.. లాభాలు పొందొచ్చు. పతంజలి, డాబర్, వైద్యనాథ్ లాంటి కంపెనీలు తులసి పంటను కొనుగోలు చేస్తాయి.
మూడు నెలలు పెంచడం ద్వారా తులసి మెుక్కలు చేతికి వస్తాయి. అప్పుడు వాటిని అమ్ముకంటే లక్షల రూపాయలు సంపాదించొచ్చు. కంపెనీలతో కాంట్రాక్ట్ పెట్టుకుని కూడా.. తులసి సాగు చేయోచ్చు. వ్యవసాయం, తులసి సాగుపై అవగాహన ఉంటేనే.. ఇందులోకి దిగడం మంచిది. తక్కువ సమయంలో ఎక్కువగా లాభం పొందొచ్చు.
ఆయుష్ మంత్రిత్వ శాఖలో భాగమైన నేషనల్ మెడిసినల్ ప్లాంట్ బోర్డ్ (NMPB), ఔషధ పంటల సాగు మరియు నిర్వహణ కోసం రైతులకు సబ్సిడీని కూడా అందిస్తుంది. NMPB వెబ్‌సైట్‌లో స్పష్టంగా చెప్పిన సబ్సిడీ ఆధారంగా ఇస్తారు. వ్యవసాయ అవసరాలను బట్టి సాగు, నర్సరీ నిర్వహణ, పంటకోత అనంతర నిర్వహణ, యాంత్రీకరణ మరియు మొదలైన వాటితో సహా మిగిలిన వాటికి కూడా సాయం ఉంటుంది.
Also Read: Agri News: మామిడి, దానిమ్మ రైతులకు శుభవార్త చెప్పిన అమెరికా... ఈ నెల నుంచి ఎగుమతులు ప్రారంభం
Also Read: PM Kisan: రైతులకు షాక్ ఇచ్చిన కేంద్రం.. పీఎం కిసాన్ డబ్బులు వెంటనే తిరిగిచ్చేయండి